భారతీయ జనతా పార్టీ/బీజేపీ: వార్తలు

Sandeshkhali: మహిళలపై అకృత్యాలకు ఎదురొడ్డి నిలిచిన 'సందేశ్‌ఖాలీ' బాధితురాలకు బిజెపి టికెట్

Sandeshkhali: సందేశ్‌ఖాలీలో (West Bengal) తృణమూల్‌ కాంగ్రెస్‌ (TMC)కు చెందిన షాజహాన్‌ షేక్‌కు అకృత్యాలకు వ్యతిరేకంగా గళమెత్తిన బాధిత మహిళకు బసిర్‌హట్‌ నియోజకవర్గ నుంచి పోటీ చేయడానికి బీజేపీ టికెట్‌ ఇచ్చింది.

BJP MP: లోక్‌సభకు రాజీనామా చేసిన 10 మంది బీజేపీ ఎంపీలు 

రాజస్థాన్,మధ్యప్రదేశ్,ఛత్తీస్‌గఢ్ మూడు రాష్ట్రాలలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన 12 మంది భారతీయ జనతా పార్టీ (బీజేపీ) పార్లమెంటు సభ్యులలో (ఎంపిలు) పది మంది తమ లోక్‌సభ స్థానాలకు బుధవారం రాజీనామా చేశారు.

04 Nov 2023

తెలంగాణ

Alliances in Telangana election: తెలంగాణ ఎన్నికలలో మిత్రులు ఎవరు? శత్రువులు ఎవరు? ఏ పార్టీ ఎవరికి మద్దతు ఇస్తుంది?

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. ఇప్పటికే ప్రధాన రాజకీయ పార్టీలు మెజార్టీ సీట్లలో అభ్యర్థులను ప్రకటించి ప్రచారంలో దూసుకుపోతున్నాయి. నామినేషన్లు కూడా ప్రారంభమైన నేపథ్యంలో పొత్తులు కూడా దాదాపు ఖరారయ్యాయి.

కంపెనీలు పేరు మార్చుకున్నట్టే కాంగ్రెస్ ఇండియా పేరుతో కూటమి పెట్టింది : మోదీ

కాంగ్రెస్ నేతృత్వంలోని విపక్షాలు ఇండియా పేరుతో కూటమి ఏర్పాటు చేయడంపై ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి మండిపడ్డారు.

13 Jul 2023

బిహార్

లాఠీఛార్జ్ లో మరణించిన బీజేపీ కార్యకర్త.. టీచర్ల పోస్టింగ్స్ నిరసన ర్యాలీలో ఉద్రిక్తత

బిహార్ రాజధాని పాట్నలో రాజకీయ అలజడులు తారా స్థాయికి చేరుకుంటున్నాయి. ఈ మేరకు బీజేపీ శ్రేణులపై పోలీసులు జరిపిన లాఠిఛార్జ్ లో ఓ కార్యకర్త మరణించారు. ఈ క్రమంలోనే రాష్ట్రంలో అగ్గిరాజుకుంది.

12 Jul 2023

రాజ్యసభ

రాజ్యసభ అభ్యర్థుల జాబితా విడుదల చేసిన బీజేపీ.. తెలుగు వారికి నో ఛాన్స్

ఈ నెల 24న 10 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు భారతీయ జనతా పార్టీ తమ అభ్యర్థుల జాబితా విడుదల చేసింది.

భాజపా అధిష్ఠానం కీలక నిర్ణయం.. 4 రాష్ట్రాలకు ఇన్‌ఛార్జ్‌ల నియామకం

భాజపా దిల్లీ పెద్దలు ఇటీవలే నాలుగు రాష్ట్రాల పార్టీ విభాగాలకు కొత్త రాష్ట్ర అధ్యక్షులను ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా ఆయా రాష్ట్రాలకు ఇన్‌ఛార్జ్‌లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

అర్థరాత్రి నరేంద్ర మోదీ నివాసంలో బీజేపీ ఉన్నత స్థాయి కీలక సమావేశం.. సార్వత్రిక ఎన్నికలపై చర్చ 

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నివాసంలో బుధవారం అర్ధరాత్రి బీజేపీ ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు.

ఈటల హత్యకు కౌశిక్ రెడ్డి కుట్ర.. ఈటల సతీమణి జమున సంచలన ఆరోపణలు

భారతీయ జనతా పార్టీ చేరికల కమిటీ ఛైర్మన్, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ హత్యకు కుట్ర చేస్తున్నారని ఈటల జమున సంచలన ఆరోపణలు చేశారు.

గుండెపోటుతో రాజ్యసభ సభ్యుడు హరద్వార్ దూబే కన్నుమూత

భారత దేశ రాజకీయాల్లో మరో విషాదం జరిగింది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన భాజపా సీనియ‌ర్ నేత‌, రాజ్యసభ సభ్యుడు హరద్వార్ దూబే కన్నుమూశారు.

మరోసారి ఈటల,రాజగోపాల్‌ రెడ్డిలకు దిల్లీకి రమ్మని కబురు.. అధినాయకత్వంతో కీలక చర్చలు

మరోసారి తెలంగాణ రాష్ట్రంపై బారతీయ జనతా పార్టీ అధినాయకత్వం దృష్టి సారించింది. రాష్ట్ర పార్టీలో నెలకొన్న తాజా పరిణామాలపై ఆ పార్టీ అగ్రనేతలు అమిత్‌ షా, పార్టీ ప్రెసిడెంట్ జేపీ నడ్డా ఆరా తీశారు.

14 Jun 2023

తుపాను

అమిత్ షా రేపటి తెలంగాణ టూర్ రద్దు 

ఖమ్మంలో రేపు జరగాల్సిన బీజేపీ సభ వాయిదా పడింది.గుజరాత్ లో బిపోర్‌జాయ్‌ తుపాను కారణంగా మహారాష్ట్ర, గుజరాత్ సహా పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్న తరుణంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పర్యటన వాయిదా పడింది.

రెండో రోజూ దిల్లీలోనే ఈటల.. ఏ క్షణంలోనా కీలక ప్రకటన వచ్చే అవకాశం

భాజపా నేత, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ శుక్రవారం హుటాహుటిన దిల్లీకి వెళ్లిన సంగతి తెలిసిందే. అక్కడ పార్టీ అగ్రనేతలతో వరుసగా భేటీ అవుతున్నారు. అయితే రెండో రోజైన శనివారం సైతం ఈటల దిల్లీలోనే మకాం వేశారు.

09 Jun 2023

తెలంగాణ

ఈటలకు అధిష్ఠానం పిలుపు.. కీలక పదవి అప్పగించే అవకాశం

తెలంగాణ గడ్డపై ఎలాగైనా కాషాయ జెండా రెపరెపలాడించాలన్నది భారతీయ జనతా పార్టీ జాతీయ నేతల లక్ష్యం. ఇందుకోసం అగ్రనేతలు తెలంగాణలో వరుస పర్యటనలు చేయనున్నారు.

తెలంగాణకి మోదీ రాక, ఈసారి అక్కడ ఓపెన్ రోడ్‌ షో

తెలంగాణకు కమలళదళాపతులు, అగ్రనేతలు క్యూ కడుతున్నారు. ఇప్పటికే పార్టీ నేషనల్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా టూర్లు ఖరారయ్యాయి.

నేనేక్కడికి వెళ్లను.. బీజేపీలోనే ఉంటా : విజయశాంతి 

భాజపా నేత విజయశాంతి ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నారని, సోషల్ మీడియాలో ఓ వార్త హల్ చల్ చేస్తోంది. దీనిపై విజయశాంతి స్పందిస్తూ పార్టీ మార్పుపై వస్తున్న వార్తలను ఖండించారు.

సార్వత్రిక ఎన్నికలకు ముందు ప్రతిపక్షాలపై కేంద్రం దేశద్రోహం అస్త్రం : అభిషేక్ సింగ్వి

దేశంలో సాధారణ ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార భాజపాకు లేని పోనీ విషయాలన్నీ గుర్తుకొస్తాయని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి అభిషేక్ సింగ్వి ఎద్దేవా చేశారు. ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసిన సింగ్వి, అధికార భాజపా నేతల తీరుపై మండిపడ్డారు.

మహిళా ఎంపీగా కాదు, సాటి మ‌హిళ‌గానే స్పందిస్తున్నా: ప్రీతమ్ ముండే 

బ్రిజ్ భూష‌ణ్ వ్య‌వ‌హారంపై భాజపా నాయకులెవ్వరూ పట్టించుకోకపోయినా ఆ అంశంపై మ‌హారాష్ట్ర‌ భాజపా మహీళా ఎంపీ ప్రీత‌మ్ ముండే మాత్రం స్పందించారు. మ‌హిళ ఎవ‌రైనా గానీ ఫిర్యాదు చేస్తే ముందుగా ఆ అంశాన్ని ప‌రిగ‌ణ‌లోకి తీసుకోవాల‌ని ఆమె సూచించారు.

11 Apr 2023

కర్ణాటక

ఎన్నికల వేళ రాజకీయాల నుంచి తప్పుకున్న బీజేపీ సీనియర్ నేత 

మూడు వారాల్లో కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాష్ట్రానికి చెందిన బీజేపీ సీనియర్ నేత కేఎస్ ఈశ్వరప్ప కీలక ప్రకటన చేశారు. తాను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు.

BJP Foundation Day: 'నేషన్ ఫస్ట్' మంత్రమే బీజేపీ నినాదం: ప్రధాని మోదీ

భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అవినీతి, బాద్‌షా మనస్థతత్వంపై పోరాటానికి కట్టుబడి ఉందని ప్రధాని మోదీ పేర్కొన్నారు.

కాంగ్రెస్ ఫైల్స్: బొగ్గు కుంభకోణం, ఎంఎఫ్ హుస్సేన్ పెయింటింగ్ లావాదేవీలపై బీజేపీ ఆరోపణలు

భారతీయ జనతా పార్టీ (బీజేపీ) 'కాంగ్రెస్ ఫైల్స్' పేరుతో తన సిరీస్‌లోని రెండో ఎపిసోడ్‌ను సోమవారం విడుదల చేయగా, 3వ ఎపిసోడ్‌ను మంగళవారం విడుదల చేసింది.

టార్గెట్ 2024 ఎలక్షన్స్: పలు రాష్ట్రాలకు కొత్త అధ్యక్షులను నియమించిన బీజేపీ

ఈ ఏడాది, వచ్చే సంవత్సరం జరగనున్న అసెంబ్లీ, సార్వత్రిక ఎన్నికలే లక్ష్యంగా బీజేపీ ముందుకు సాగుతోంది. జనరల్ ఎన్నికల్లో వరుసగా మూడోసారి విజయ సాధించి చరిత్ర సృష్టించాలని కాషాయ దళం ఉవ్విళ్లురూతోంది. ఈ క్రమంలో పార్టీలో రాష్ట్రాల వారికి కీలక మార్పులు చేస్తోంది.

అదానీ వ్యవహారంపై మౌనం వీడిన అమిత్ షా

అదానీ గ్రూప్‌పై హిండెన్‌బర్గ్ ఇచ్చిన నివేదిక దేశ రాజకీయాల్లో ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ వ్యవహారంపై ధర్యాప్తు చేయాలని ప్రతిపక్షాలు ఇప్పటికే తమ గళాన్ని మారు మ్రోగించాయి. ప్రస్తుతం ఈ వ్యవహారంపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా మౌనం వీడారు.

త్రిపురలో అసెంబ్లీ పోరు: 'రథయాత్ర'తో ప్రజల్లోకి బీజేపీ

అయోధ్య రామమందిరంపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా కీలక ప్రకటన చేశారు. జనవరి 1, 2024 నాటికి రామమందిరాన్ని సిద్ధం చేస్తామని చెప్పారు. త్రిపురలో ఎనిమిది రోజలు పాటు జరగనున్న బీజేపీ 'రథయాత్ర'ను ఆయన ప్రారంభించారు. అనంతరం బహిరంగ సభలో ఆయన కీలక ప్రసంగం చేశారు.

03 Jan 2023

బిహార్

'బిహార్‌లో ఆటవిక రాజ్యం నడుస్తోంది'.. నితీశ్‌పై నడ్డా విమర్శనాస్త్రాలు

భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా బిహార్‌లో పర్యటించారు. ముఖ్యమంత్రి నితీశ్ కుమార్.. బీజేపీతో బంధాన్ని తెంచుకున్న తర్వాత.. నడ్డా బిహార్‌లో పర్యటించడం ఇదే తొలిసారి. ఈ సందర్భంగా నితీశ్‌పై నడ్డా విమర్శాస్త్రాలు సంధించారు.

టార్గెట్ 2024: కేంద్ర మంత్రివర్గం, బీజేపీలో భారీ మార్పులకు మోదీ స్కెచ్

2023లో 9 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు.. 2024లో లోక్‌సభ ఎలక్షన్లు ఉన్న నేపథ్యంలో బీజేపీలో, కేంద్ర మంత్రివర్గంలో భారీమార్పులు చోటుచేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్ ప్రవేశ పెట్టనున్న నేపథ్యంలో.. అంత కంటే ముందే.. ఈ మార్పులు, చేర్పులు చేపట్టాలని ప్రధాని మోదీ భావిస్తున్నట్లు సమాచారం.

'బీజేపీ నాకు గురువులాంటింది'.. కమలం పార్టీపై రాహుల్ వ్యంగ్యాస్త్రాలు

భారతీయ జనతా పార్టీ తనకు గురువులాంటిదని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. తాను ఎలా ఉండకూడదో , ఏ పనులు చేయకూడదో.. బీజేపీ నాయకులే తనకు శిక్షణ ఇచ్చినట్లు వ్యంగ్యాస్త్రాలు సంధించారు రాహుల్.