Page Loader
తెలంగాణకి మోదీ రాక, ఈసారి అక్కడ ఓపెన్ రోడ్‌ షో
కషాయ తెలంగాణ కోసం మోదీ రాక, ఈసారి అక్కడ ఓపెన్ రోడ్‌ షో

తెలంగాణకి మోదీ రాక, ఈసారి అక్కడ ఓపెన్ రోడ్‌ షో

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Jun 06, 2023
06:30 pm

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణకు కమలళదళాపతులు, అగ్రనేతలు క్యూ కడుతున్నారు. ఇప్పటికే పార్టీ నేషనల్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా టూర్లు ఖరారయ్యాయి. తాజాగా దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సైతం తెలంగాణకు రానున్నట్లు సమాచారం. రాష్ట్రంలో సాధారణ ఎన్నికలు సమీపిస్తుండటంతో కమలదళం తెలంగాణపై దృష్టి సారిస్తోంది. కాషాయ వాడి వేడి తగ్గకుండా, మరింత దూకుడుగా నిరంతరం ప్రజల్లోనే ఉండేలా ప్రణాళికలు రచిస్తోంది. ప్రజాసంగ్రామ యాత్ర పేరుతో పార్టీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ ఇప్పటికే ప్రజల్లోకి చొచ్చుకెళ్లారు. తాజాగా మహాజన సంపర్క్ అభియాన్ పేరిట మరోసారి తెలంగాణ వాసులను ఆకర్షించేందుకు భాజపా నాయకత్వం కృషి చేస్తోంది.

Pm Modi Road Show In Hyderabad Malkajgiri Loksabha 

మల్కాజ్ గిరి రోడ్ల మీద మోదీ రోడ్ షో

మహా జన్ సంపర్క్ అభియాన్ ​లో భాగంగా జూన్ లో దేశంలోనే అతిపెద్ద నియోజవర్గాల్లో ఒకటైన మల్కాజ్ గిరి లోక్ సభ పరిధిలో ప్రధాని మోదీ రోడ్ షోకి కమలనాథులు ప్లాన్ చేస్తున్నారు. కర్ణాటక తరహాలోనే హైదరాబాద్ ​లోనూ ప్రధాని రోడ్ షో ఏర్పాట్లు చేస్తున్నట్లుగా పార్టీ అధికార వర్గాలు అంటున్నాయి. మల్కాజ్ గిరి పార్లమెంట్ పరిధిలో మోదీ రోడ్ షో సహా సికింద్రాబాద్ లేదా హైదరాబాద్ లోక్ సభ పరిధిలో నరేంద్ర మోదీ ఓ భారీ బహిరంగ సభలో పాల్గొంటారని తెలుస్తోంది. రెండు రోజుల్లో ప్రధాని టూర్ డీటెయిల్స్ తేదీలు, స్థలాలు ఖరారు కానున్నట్లు సమాచారం.