Page Loader
రాజ్యసభ అభ్యర్థుల జాబితా విడుదల చేసిన బీజేపీ.. తెలుగు వారికి నో ఛాన్స్
రాజ్యసభ అభ్యర్థుల జాబితా విడుదల చేసిన బీజేపీ.. తెలుగు వారికి నో ఛాన్స్

రాజ్యసభ అభ్యర్థుల జాబితా విడుదల చేసిన బీజేపీ.. తెలుగు వారికి నో ఛాన్స్

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Jul 12, 2023
03:16 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఈ నెల 24న 10 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు భారతీయ జనతా పార్టీ తమ అభ్యర్థుల జాబితా విడుదల చేసింది. గుజరాత్‌ నుంచి బాబుభాయ్, దేవ్‌సిన్హ్ జాలకు అవకాశం ఇచ్చింది. మరోవైపు బెంగాల్‌ నుంచి అనంత మహరాజ్‌కు అభ్యర్థిత్వం ఖరారు చేసింది. ఇప్పటికే గుజరాత్‌ నుంచి విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్‌ రాజ్యసభకు నామపత్రాలను దాఖలు చేశారు. అయితే జాబితాలో తెలుగు రాష్ట్రాల నుంచి ఎవరికీ చోటు దక్కలేదు. ఈ నేపథ్యంలో గుజరాత్‌లో 3, బెంగాల్‌లో 6, గోవాలో ఒక స్థానానికి ఎన్నికలు జరగనున్నాయి. మరోవైపు 10 స్థానాలకు గానూ బీజేపీ ఐదు స్థానాల్లో గెలిచేందుకు అవకాశం ఉంది. ఈ క్రమంలో నామినేషన్లకు గడువు రేపటితో ముగియనుంది.

details

గ్రేటర్ కూచ్ బెహార్ ప్రత్యేక రాష్ట్ర సాధన నేతకు బీజేపీ టిక్కెట్

అయితే బెంగాల్ బీజేపీ అభ్యర్థిగా ఖరారైన అనంత రాయ్ మహారాజ్, వెస్ట్ బెంగాల్ నుంచి గ్రేటర్ కూచ్ బెహార్ ను విడదీసి ప్రత్యేక రాష్ట్రాన్ని చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కొంత కాలం క్రితం అమిత్ షా, గ్రేటర్ కూచ్‌ బెహార్ పీపుల్స్ అసోసియేషన్ నేత అనంత్ మహరాజ్‌ను కలిశారు. కూచ్‌ బెహార్‌ రాస్‌మేళా మైదానంలో మోదీ బహిరంగ సభకు మహరాజ్‌ హాజరయ్యారు. బెంగాల్ లో మొత్తం 294 స్థానాలకు గానూ టీఎంసీకి 216 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ మేరకు ఐదుగురు బీజేపీ ఎమ్మెల్యేలు ఇటీవలే పార్టీ మారారు. కాగా ప్రస్తుతం బీజేపీకి 70 మంది సభ్యులు మాత్రమే ఉన్నారు. బలాబలాల ప్రకారం టీఎంసీ 6 స్థానాలు, బీజేపీ ఒక స్థానం దక్కించుకోనుంది.