Page Loader
టార్గెట్ 2024 ఎలక్షన్స్: పలు రాష్ట్రాలకు కొత్త అధ్యక్షులను నియమించిన బీజేపీ
పలు రాష్ట్రాలకు కొత్త అధ్యక్షులను నియమించిన బీజేపీ

టార్గెట్ 2024 ఎలక్షన్స్: పలు రాష్ట్రాలకు కొత్త అధ్యక్షులను నియమించిన బీజేపీ

వ్రాసిన వారు Stalin
Mar 23, 2023
05:41 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఈ ఏడాది, వచ్చే సంవత్సరం జరగనున్న అసెంబ్లీ, సార్వత్రిక ఎన్నికలే లక్ష్యంగా బీజేపీ ముందుకు సాగుతోంది. జనరల్ ఎన్నికల్లో వరుసగా మూడోసారి విజయ సాధించి చరిత్ర సృష్టించాలని కాషాయ దళం ఉవ్విళ్లురూతోంది. ఈ క్రమంలో పార్టీలో రాష్ట్రాల వారికి కీలక మార్పులు చేస్తోంది. తాజాగా బీజేపీ అధిష్ఠానం పలు రాష్ట్రాలకు కొత్త అధ్యక్షులను నియమించింది. బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా గురువారం రాజస్థాన్, ఒడిశా, దిల్లీ , బిహార్ రాష్ట్రాలకు పార్టీ చీఫ్‌లను ప్రకటించారు. ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న కీలక రాష్ట్రాల్లో ఒకటైన రాజస్థాన్ బీజీపీ అధ్యక్షుడిగా ఎంపీ సీపీ జోషి నియామకం అయ్యారు. సతీష్ పునియా స్థానంలో జోషిని నడ్డా నియమించారు.

బీజేపీ

త్వరలోనే మిగతా రాష్ట్రాల్లో కూడా కీలక మార్పులు జరగే అవకాశం

ప్రస్తుతం దిల్లీలో బీజేపీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న వీరేంద్ర సచ్‌దేవాను రాష్ట్ర అధ్యక్షుడిగా అధిష్ఠానం నియమించింది. బిహార్, ఒడిశా రాష్ట్రాల్లో కొత్త రాష్ట్ర అధ్యక్షుల నియామకాన్ని కూడా బీజేపీ ప్రకటించింది. బిహార్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బీహార్ లెజిస్లేట్ కౌన్సిల్ సభ్యుడు సామ్రాట్ చౌదరి నియమితులయ్యారు. ఒడిశాలో మాజీ మంత్రి మన్మోహన్ సమాల్‌ను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించారు. త్వరలోనే మిగత రాష్ట్రాల్లో కూడా పార్టీ పదవులకు సంబంధించి కీలక మార్పులు, చేర్పులు జరిగే అవకాశం ఉంది