Page Loader
కాంగ్రెస్‌లోకి బీజేపీ ఎమ్మెల్సీ; ఎన్నికల వేళ కమలం పార్టీకి షాక్
ఎన్నికల ముంగిట బీజేపీకి రాజీనామ చేసిన ఎమ్మెల్సీ

కాంగ్రెస్‌లోకి బీజేపీ ఎమ్మెల్సీ; ఎన్నికల వేళ కమలం పార్టీకి షాక్

వ్రాసిన వారు Stalin
Mar 21, 2023
02:34 pm

ఈ వార్తాకథనం ఏంటి

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. మరో నెల రోజుల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అధికార బీజేపీ షాక్ తగిలింది. బీజేపీ ఎమ్మెల్సీ బాబూరావు చించన్‌సూర్ పార్టీని వీడారు. త్వరలోనే ఆయన కాంగ్రెస్ పార్టీలోకి చేరనున్నారు. బాబూరావు చించనసూర్ రాజీమానాతో ఈ నెలలో పార్టీని వీడిన కీలక నేతల సంఖ్య రెండుకు చేరింది. అంతకుముందు ప్రభుత్వంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని ఆరోపిస్తూ ఎమ్మెల్సీ పుట్టన్న బీజేపీని వీడి కాంగ్రెస్‌లో చేరారు.

బీజేపీ

మార్చి 25న కాంగ్రెస్‌లో చేరిక

కోలి సామాజికవర్గానికి చెందిన బాబూరావు చించనసూర్ మార్చి 25న కాంగ్రెస్‌లో చేరే అవకాశం ఉంది. ప్రభుత్వంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని గతంలో పుట్టన్న కాంగ్రెస్‌లో చేరారు. బెంగళూరు అర్బన్, బెంగళూరు రూరల్, రామనగర జిల్లాల ఉపాధ్యాయ నియోజకవర్గానికి నాలుగుసార్లు శాసన మండలి సభ్యుడిగా పుట్టన్న ప్రాతినిధ్యం వహించారు. ఇంకో నెలరోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండటంతో అధికారి పార్టీకి ఈ రాజీనామాలు ప్రతికూలంగా మారే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.