Page Loader
రాహుల్ గాంధీ కాంగ్రెస్ ముఖచిత్రంగా ఉంటే మోదీకే లాభం: మమతా బెనర్జీ
రాహుల్ గాంధీ కాంగ్రెస్ ముఖచిత్రంగా ఉంటే మోదీకే లాభం: మమతా బెనర్జీ

రాహుల్ గాంధీ కాంగ్రెస్ ముఖచిత్రంగా ఉంటే మోదీకే లాభం: మమతా బెనర్జీ

వ్రాసిన వారు Stalin
Mar 20, 2023
01:32 pm

ఈ వార్తాకథనం ఏంటి

కోల్‌కతా నుంచి వర్చువల్‌గా జరిగిన ముర్షిదాబాద్‌లోని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై సంచనల వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీ ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ ముఖచిత్రమైతే ప్రధాని నరేంద్ర మోడీని ఎవరూ టార్గెట్ చేయలేరని మమతా అన్నారు. ప్రధాని మోదీకి 'అతిపెద్ద టీఆర్‌పీ' రాహుల్ గాంధీయే అన్నారు. రాహుల్ గాంధీని నాయకుడిగా చేయాలని, ఆయనను హీరోగా నిలబెట్టాలని బీజేపీ ఉవ్విళ్లూరుతున్నందున బీజేపీ పార్లమెంట్‌ను నడపనివ్వడం లేదని ఆమె ఆరోపించింది.

మమతా బెనర్జీ

బీజేపీ ముందు తలవంచేది కాంగ్రెస్ పార్టీ: మమత

బీజేపీ ముందు తలవంచేది కాంగ్రెస్ అని మమత తేల్చి చెప్పారు. తృణమూల్‌కు వ్యతిరేకంగా మైనారిటీలను కాంగ్రెస్, సీపీఎం, బీజేపీలు రెచ్చగొడుతున్నాయని విమర్శించారు. రాహుల్ గాంధీ ప్రతిపక్ష ముఖంగా ఉండటం వల్ల బీజేపీకి ప్రయోజనం చేకూరుతుందని తృణమూల్ ఎంపీ, లోక్‌సభలో పార్టీ నాయకుడు సుదీప్ బందోపాధ్యాయ అన్నారు. బెంగాల్,ఈశాన్య రాష్ట్రాల్లో తృణమూల్ తడ ఓట్లను లాగేసుకుంటోందని కాంగ్రెస్ కలవరపడుతోందని ఆయన పేర్కొన్నారు. ఇటీవల ముర్షిదాబాద్‌లో జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. ఇది అంతకుముందు టీఎంసీ సిట్టింగ్ సీటు కావడం గమనార్హం.