గుండెపోటుతో రాజ్యసభ సభ్యుడు హరద్వార్ దూబే కన్నుమూత
భారత దేశ రాజకీయాల్లో మరో విషాదం జరిగింది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన భాజపా సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు హరద్వార్ దూబే కన్నుమూశారు. అనారోగ్య కారణంగా దిల్లీలోని ఫోర్టిస్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం తెల్లవారుజామున మరణించారు. ఈ క్రమంలోనే ఆయన భౌతికకాయాన్ని మధ్యాహ్నం ఆగ్రాకు తరలించనున్నారు. దూబే అస్వస్థతు గురికావడంతో కుటుంబీకులు ఆయనను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అనంతరం తండ్రి క్షేమంగానే ఉన్నారని ఆయన కుమారుడు ప్రన్షు దూబే ఆదివారం వెల్లడించారు. అయితే ఆస్పత్రిలోనే ఆకస్మాత్తుగా తలెత్తిన గుండె నొప్పి కారణంగా కొద్దిసేపటికే శ్వాస నిలిచిపోయిందన్నారు. దూబే మృతి పట్ల పలువురు నేతలు సంతాపం ప్రకటించారు. ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని ప్రార్థించారు. 2020 నుంచి దూబే రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్నారు.