Page Loader
మరోసారి ఈటల,రాజగోపాల్‌ రెడ్డిలకు దిల్లీకి రమ్మని కబురు.. అధినాయకత్వంతో కీలక చర్చలు
మరోసారి ఈటల,రాజగోపాల్‌ రెడ్డిలకు దిల్లీకి రమ్మని కబురు

మరోసారి ఈటల,రాజగోపాల్‌ రెడ్డిలకు దిల్లీకి రమ్మని కబురు.. అధినాయకత్వంతో కీలక చర్చలు

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Jun 23, 2023
05:50 pm

ఈ వార్తాకథనం ఏంటి

మరోసారి తెలంగాణ రాష్ట్రంపై బారతీయ జనతా పార్టీ అధినాయకత్వం దృష్టి సారించింది. రాష్ట్ర పార్టీలో నెలకొన్న తాజా పరిణామాలపై ఆ పార్టీ అగ్రనేతలు అమిత్‌ షా, పార్టీ ప్రెసిడెంట్ జేపీ నడ్డా ఆరా తీశారు. ఈ నేపథ్యంలోనే స్టేట్ సీనియర్‌ నేతలు ఈటల రాజేందర్‌, కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డిని వెంటనే దిల్లీ రావాలని ఆదేశించారు. ఈ మేరకు ఈ ఇద్దరు నేతలు, దిల్లీ వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఇటీవలే పార్టీ కార్యక్రమాలకు సైతం పలువురు సీనియర్లు దూరంగా ఉంటున్న నేపథ్యంలోనే చర్చలు చేయనున్నట్లు సమాచారం. కర్ణాటక ఎన్నికల ఫలితాల అనంతరం తెలంగాణలో కమలదళం కాస్త నెమ్మదించినట్లు కనిపిస్తోందని రాజకీయ వర్గాల్లో చర్చసాగుతోంది.

DETAILS

ఈటెల, రాజగోపాల్‌ రెడ్డి పార్టీ మారుతున్నారని ప్రచారం 

తెలంగాణలో ఎన్నికలకు గడువు సమీపిస్తున్న వేళ పార్టీలోని అసంతృప్త నేతలను బుజ్జగించే పనిలో భాజపా అధిష్ఠానం నిమగ్నమైంది. ఓ వైపు పార్టీ చేరికల కమిటీ ఛైర్మన్‌ ఈటెల రాజేందర్‌, కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి పార్టీ మారుతున్నారని ప్రచారం జరుగుతోంది. మరోవైపు దిల్లీకి రావాలని పార్టీ పెద్దలు ఆదేశించడం రాష్ట్ర రాజకీయాల్లో ప్రాధాన్యత సంతరించుకొంది. కొన్ని రోజులుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నఈటెల, రాజగోపాల్‌రెడ్డితో పాటు మరికొందరు సీనియర్లతో పార్టీ భవిష్యత్ పై చర్చించనున్నట్లు తెలుస్తోంది. రానున్న ఎన్నికల్లో తెలంగాణలో అధికారమే లక్ష్యంగా దూసుకెళ్లాలని, నేతల మధ్య నెలకొన్న ఆధిపత్య పోరుకు చెక్‌ పెట్టాలని అధిష్ఠానం నిర్ణయించినట్టు తెలుస్తోంది.