యూపీఏ ప్రభుత్వం 12 లక్షల కోట్ల కుంభకోణాలకు పాల్పడింది: అమిత్ షా
కాంగ్రెస్ పాలనపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా శుక్రవారం విరుచుకుపడ్డారు. యూపీఏ హయాంలో భారీఎత్తున కుంభకోణాలు జరిగినట్లు చెప్పారు. జమ్ముకశ్మీర్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు షా శంకుస్థాపన చేశారు.అనంతరం ఆయన మాట్లాడారు. యూపీఏ ప్రభుత్వం మొత్తం రూ.12లక్షల కోట్ల కుంభకోణాలకు పాల్పడిందని విమర్శించారు. దేశంలో అవినీతి నిర్మూలనకు ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం బలమైన పునాది వేసిందని షా స్పష్టం చేశారు. నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీపై కూడా అమిత్ షా విమర్శలు గుప్పించారు. జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదం కారణంగా 42,000మంది చనిపోయారని, దీనికి ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. ఆర్టికల్ 370వల్ల ఎటువంటి అభివృద్ధి జరగలేదన్నారు. జమ్ముకశ్మీర్‌లో 42,000మంది మరణానికి కారణమైన ఎన్‌సీ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా, పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీలను ప్రశ్నించాలన్నారు.