Page Loader
కాంగ్రెస్ ఫైల్స్: బొగ్గు కుంభకోణం, ఎంఎఫ్ హుస్సేన్ పెయింటింగ్ లావాదేవీలపై బీజేపీ ఆరోపణలు
'కాంగ్రెస్ ఫైల్స్' పార్ట్-2ను విడుదల చేసిన బీజేపీ; ఎంఎఫ్ హుస్సేన్ పెయింటింగ్‌ లావాదేవీలపై ఆరోపణలు

కాంగ్రెస్ ఫైల్స్: బొగ్గు కుంభకోణం, ఎంఎఫ్ హుస్సేన్ పెయింటింగ్ లావాదేవీలపై బీజేపీ ఆరోపణలు

వ్రాసిన వారు Stalin
Apr 04, 2023
11:59 am

ఈ వార్తాకథనం ఏంటి

భారతీయ జనతా పార్టీ (బీజేపీ) 'కాంగ్రెస్ ఫైల్స్' పేరుతో తన సిరీస్‌లోని రెండో ఎపిసోడ్‌ను సోమవారం విడుదల చేయగా, 3వ ఎపిసోడ్‌ను మంగళవారం విడుదల చేసింది. 'కాంగ్రెస్ ఫైల్స్' మూడో ఎపిసోడ్‌లో 2012లో బొగ్గు బ్లాక్ కేటాపు కుంభకోణంపై దృష్టి సారించగా, పార్ట్ -2లో ఎంఎఫ్ హుస్సేఎన్ పెయింటింగ్ పేరుతో దోపిడీని, రాణా కపూర్‌కు పద్మభూషణ్ హామీని హైలైట్ చేస్తుంది. 2012లో బొగ్గు కుంభకోణానికి యూపీఏ ప్రభుత్వమే పార్ట్ మూడో ఎపిసోడ్‌లో ఆరోపించారు. మన్మోహన్ సింగ్ రెండవసారి ప్రధానమంత్రి అయినప్పుడు అప్పట్లో కాంగ్రెస్ ప్రధాన లక్ష్య స్కామ్‌లని బీజేపీ వీడియో పేర్కొంది. ఈ స్కామ్ కారణంగా భారతదేశం రూ. 1,86,000 కోట్ల నష్టాన్ని చూసిందని కాషాయ పార్టీ తాజా ఎపిసోడ్‌లో విమర్శించింది.

కాంగ్రెస్

కాంగ్రెస్ తన 70ఏళ్ల పాలనలో రూ.48,20,69,00,00,000ను దోచుకున్నది: బీజేపీ

కాంగ్రెస్ ఫైల్స్ పార్ట్-2లో పెయింటింగ్‌పేరుతో దోపిడీ, పద్మభూషణ్‌అవార్డును ఆశ చూపడం వంటి విషయాలను చూపించారు. రూ.2కోట్లకు ఎంఎఫ్ హుస్సేన్ పెయింటింగ్‌ను కొనుగోలు చేయాలని యెస్ బ్యాంక్ మాజీ సీఈఓ రాణా కపూర్‌ను ప్రియాంక గాంధీ వాద్రా ఒత్తిడి చేసిన విషయాన్ని ఈ వీడియోలో బీజేపీ హైలెట్ చేసింది. కాంగ్రెస్ తన 70ఏళ్ల పాలనలో రూ.48,20,69,00,00,000 దోచుకున్నట్లు బీజేపీ ఆరోపించింది. ఎంఎఫ్ హుస్సేన్ పెయింటింగ్‌ను కొనుగోలు చేస్తే తనకు అత్యున్నత పురస్కారాలలో ఒకటైన పద్మభూషణ్ ఇస్తామని వాగ్ధానం చేసినట్లు ఈడీకు రాణా కపూర్‌ మాటలను బీజేపీ ఈ వీడియోలో కోట్ చేసింది.

బీజేపీ

ఆ రూ.2కోట్లు సోనియా చికిత్సకు వినియోగం

అంతేకాకుండా ఆ రూ.2కోట్ల రూపాయలను కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ చికిత్స కోసం వినియోగించినట్లు 'కాంగ్రెస్ ఫైల్స్' రెండవ ఎపిసోడ్‌ పేర్కొంది. మోదీ ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు చేస్తున్న కాంగ్రెస్‌ను ఇరుకున పెట్టేందుకు ఈ వీడియోలను బీజేపీ తన ట్విట్టర్ హ్యాండిగ్ ద్వారా విడుదల చేస్తున్నట్లు తెలుస్తోంది. 2004-2014 మధ్య కాంగ్రెస్ పాలనను ఆ పార్టీకి "లాస్ట్ డికేడ్"గా బీజేపీ పేర్కొంది. కాంగ్రెస్ ఇప్పటికే రాణా కపూర్ చేసిన ఆరోపణను రాజకీయ ప్రతీకారగా చర్యగా అభివర్ణంచింది. ఈ వ్యాఖ్యల్లో రాణా కపూర్ తో పాటు ఈడీ విశ్వసనీయతను కాంగ్రెస్ ప్రశ్నించింది. రాణా కపూర్ మార్చి 2020 నుంచి అవినీతి ఆరోపణల కేసులో ముంబయి జైలులో ఉన్నారు.