Page Loader
పరువు నష్టం కేసు: రాహుల్ గాంధీ పిటిషన్‌పై విచారణ మే 3వ తేదీకి వాయిదా
పరువు నష్టం కేసు: రాహుల్ గాంధీ పిటిషన్‌పై విచారణ మే 3వ తేదీ వాయిదా

పరువు నష్టం కేసు: రాహుల్ గాంధీ పిటిషన్‌పై విచారణ మే 3వ తేదీకి వాయిదా

వ్రాసిన వారు Stalin
Apr 03, 2023
03:48 pm

ఈ వార్తాకథనం ఏంటి

పరువు నష్టం కేసులో తనను దోషిగా సూరత్ కోర్టు తేల్చడాన్ని సవాల్ చేస్తూ సోమవారం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సెషన్స్ కోర్టును ఆశ్రయించారు. రాహుల్ గాంధీ పిటిషన్‌ను స్వీకరించిన సూరత్ సెషన్స్ కోర్టు, తదిపరి విచారణను మే 3వ తేదీకి వాయిదా వేసింది. రాహుల్ గాంధీ 2019లో ఎన్నికల ప్రచారంలో భాగంగా "మోదీ ఇంటిపేరు" చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో నమోదైన క్రిమినల్ పరువు నష్టం కేసులో సూరత్ కోర్టు దోషిగా తేల్చింది. సూరత్ సెషన్స్ కోర్టులో అప్పీల్ చేసేందుకు వచ్చిన రాహుల్ వెంట, ప్రియాంక గాంధీ, రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు కెసి వేణుగోపాల్ మరియు ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ వంటి సీనియర్ నాయకులు ఉన్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

రాహుల్ గాంధీ బెయిల్‌ను ఏప్రిల్ 13వరకు పొడిగించిన కోర్టు

ట్విట్టర్ పోస్ట్ చేయండి

రాహుల్ గాంధీ అప్పీల్‌పై సూరత్ సెషన్స్ కోర్టు విచారణ