మహిళా ఎంపీగా కాదు, సాటి మహిళగానే స్పందిస్తున్నా: ప్రీతమ్ ముండే
బ్రిజ్ భూషణ్ వ్యవహారంపై భాజపా నాయకులెవ్వరూ పట్టించుకోకపోయినా ఆ అంశంపై మహారాష్ట్ర భాజపా మహీళా ఎంపీ ప్రీతమ్ ముండే మాత్రం స్పందించారు. మహిళ ఎవరైనా గానీ ఫిర్యాదు చేస్తే ముందుగా ఆ అంశాన్ని పరిగణలోకి తీసుకోవాలని ఆమె సూచించారు. అనంతరం ఆ ఫిర్యాదు సరైందా కాదా అనే కోణంలో విచారణ చేయాలని, తదనంతరమే తుది నిర్ణయం చేయాలని ఆమె అభిప్రాయపడ్డారు. మహాలోని బీడ్ జిల్లాలో పాత్రికేయులతో ఎంపీ మాట్లాడారు. రెజ్లర్ల ఆరోపణల నేపథ్యంలో బ్రిజ్‌పై చర్యలు తీసుకోవాలని ఎంపీ ఆకాంక్షించారు. ఓ పార్లమెంట్ మెంబర్ గా కాకుండా, సాటి మహిళగానే ఈ విషయంపై అభ్యర్థిస్తున్నట్లు చెప్పారు. ఉమెన్ రెజ్లర్ల ఆరోపణలపై ఎంపీ బ్రిజ్‌పై కఠినంగా వ్యవహరించాలని ప్రీతమ్ అభిప్రాయపడ్డారు.
బాధితులతో ప్రభుత్వం సరైన రీతిలో చర్చించలేదు : మహిళా ఎంపీ
మహిళపై లైంగిక వేధింపుల లాంటి తీవ్రమైన కేసుల్లో బాధితులు చేసిన ఫిర్యాదు పట్ల పోలీసులు నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తే దాన్ని ప్రజాస్వామ్యంలో స్వాగతించలేమన్నారు. ప్రస్తుత కేంద్రంలో తాను భాగస్వామ్యురాలునే అయినా, రెజ్లర్లతో సర్కార్ సరిగ్గా స్పందించలేదని, సరైన చర్చలు జరపలేదనే విషయాన్ని తానూ అంగీకరించాల్సి వస్తోందనే విషయాన్ని బాధతప్త హృదయంతో ముండే ఆవేదన వ్యక్తం చేశారు. భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం ప్రకారం దేశం ప్రాధాన్యమని, తర్వాతే వ్యక్తి అని ఆమె అన్నారు. అయినప్పటికీ, ఒకరి వ్యక్తిగత ఆలోచనలు కూడా ముఖ్యమైనవేనని చెప్పుకొచ్చారు. ముండే అక్కాచెల్లెళ్లు ఎవరో కాదు, దివంగత భాజపా నాయకుడు, మాజీ కేంద్ర మంత్రి గోపీనాథ్ ముండే. ఆయన సంతానంలో ఒకరైన ప్రీతమ్ ముండేనే ఈ మహిళా ఎంపీ.