
బ్రిజ్ భూషణ్ కు యోగి సర్కార్ ఝలక్... ర్యాలీకి నో పర్మిషన్
ఈ వార్తాకథనం ఏంటి
దేశవ్యాప్తంగా సంచలన లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటోన్న భాజపా ఎంపీ బ్రిజ్ భూషణ్ కు యోగీ సర్కార్ ఝలక్ ఇచ్చింది.
తన బలాన్ని చాటిచెప్పేందుకు ర్యాలీ నిర్వహణ చేయాలన్న ఈ ఎంపీకి ఇంకా పర్మిషన్ రాలేదని సమాచారం. దీంతో చేసేదేం లేక ర్యాలీని కొంత కాలం పాటు వాయిదా వేశారు.
యూపీలో అన్ని వర్గాల ప్రజల మద్దతుతో గత 28 ఏళ్లుగా చట్ట సభ సభ్యుడిగా కొనసాగుతున్నానని, తాను ఉన్నది అధికార పక్షమే అయినా ప్రతిపక్షమే అయినా అందరినీ కలుపుతూ కృషి చేశానని తెలిపారు.
అన్ని వర్గాలకు చెందిన లక్షలాది మంది జనం తనకు మద్దతు తెలుపుతున్నారని పేర్కొన్నారు. దీని కారణంగానే రాజకీయ ప్రత్యర్థులు ఆయనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు.
Details
సాధువుల ఆశీర్వాదంతో 'జన చేతన్ మహార్యాలీ'
వివిధ వర్గాల్లో ఉన్న సామరస్యాన్ని దెబ్బతీయాలని చూస్తున్నారని భూషణ్ ఆరోపించారు. దీన్ని ఎదుర్కొనేందుకు జూన్ 5న సాధువుల ఆశీర్వాదంతో 'జన చేతన్ మహార్యాలీ'ని చేపట్టాలనుకున్నట్లు వివరించారు.
మరోపక్క తనపై నమోదైన కేసుల్లో దర్యాప్తు జరుగుతోందన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలను గౌరవిస్తూ కొన్ని రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నానని సోషల్ మీడియాలో వెల్లడించారు.
సోమవారం అయోధ్యలో నిర్వహించాల్సిన ర్యాలీ వాయిదా విషయాన్ని స్వయంగా బ్రిజ్ భూషణ్ ఫేస్ బుక్ ద్వారా ప్రకటించడం విశేషం.
ఫెడరేషన్ ఛైర్మన్ భూషణ్ పై కఠిన చర్యలు తీసుకోవాలని హరియాణాలోని కురుక్షేత్రలో కిసాన్ మోర్చా నేతలు డిమాండ్ చేశారు. ఇందుకోసం ఏకంగా రాష్ట్రపతినే కలవాలని ఆ సంఘం నాయకత్వం నిర్ణయించింది.