Somalia: సోమాలియాలో త్రుటిలో తప్పిన విమాన ప్రమాదం.. 50 మంది ప్రాణాలు కాపాడిన పైలట్
ఈ వార్తాకథనం ఏంటి
సోమాలియాలో ఓ భారీ విమాన ప్రమాదం త్రుటిలో తప్పింది. సుమారు 50 మంది ప్రయాణికులతో ప్రయాణిస్తున్న విమానం అదుపు తప్పి హిందూ మహాసముద్రం వైపు దూసుకెళ్లింది. అయితే ఎలాంటి పేలుడు జరగకుండా అక్కడే ఆగిపోవడంతో అందరూ సురక్షితంగా బయటపడ్డారు. ఈ సంఘటనతో ప్రయాణికులు సహా సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు.దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతోంది. స్టార్ స్కై ఏవియేషన్ సంస్థకు చెందిన ఫోకర్ విమానం మంగళవారం అడెన్ అబ్దుల్లె అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి 50 మంది ప్రయాణికులు,ఐదుగురు సిబ్బందితో బయలుదేరింది. టేకాఫ్ అయిన సుమారు 15 నిమిషాలకే విమానంలో సాంకేతిక లోపాలు తలెత్తాయి. ఈ పరిస్థితిని గుర్తించిన పైలట్ వెంటనే మొగడిషు విమానాశ్రయానికి తిరిగి రావాలని నిర్ణయించాడు.
వివరాలు
పైలట్ చూపిన చాకచక్యం, సమయస్ఫూర్తిపై సోషల్ మీడియాలో ప్రశంసలు
అయితే రన్‌వేపై విమానాన్ని దింపడం సాధ్యం కాలేదు. దీంతో అప్రమత్తమైన పైలట్ అసాధారణ ధైర్యసాహసాలతో విమానాన్ని హిందూ మహాసముద్ర తీరానికి సమీపంలో సురక్షితంగా ల్యాండ్ చేశాడు. అదృష్టవశాత్తు ఎలాంటి పేలుడు సంభవించలేదు. విమానం నిలిచిన వెంటనే అత్యవసర ద్వారాల ద్వారా ప్రయాణికులంతా బయటకు వచ్చారు. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ సంఘటనలో పైలట్ చూపిన చాకచక్యం, సమయస్ఫూర్తిపై సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది. విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేసి ప్రయాణికుల ప్రాణాలను కాపాడినందుకు నెటిజన్లు కొనియాడుతున్నారు. మరోవైపు అత్యవసర ల్యాండింగ్‌కు కారణమైన అంశాలపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.
వివరాలు
నిస్సార నీటిలో ఆగిన విమానం
ఈ సందర్భంగా సివిల్ ఏవియేషన్ అథారిటీ (CAA) డైరెక్టర్ అహ్మద్ మకాలిన్ హసన్ మాట్లాడుతూ, ల్యాండింగ్ ప్రయత్నంలో విమానం రన్‌వేపై దిగినప్పటికీ అక్కడ ఆగలేకపోయిందన్నారు. టార్ రోడ్డును దాటి హిందూ మహాసముద్ర తీరాన ఉన్న నిస్సార నీటిలో విమానం ఆగిపోయిందని తెలిపారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో ఇదే..
Today, a passenger aircraft operated by Starsky Aviation Ltd was involved in an incident near Aden Adde International Airport shortly after take-off. The plane, carrying 50 passengers bound for Guriel and Galkaayo, developed mechanical problems about 15 minutes into the flight… pic.twitter.com/9MaUeJ5UWw
— AUSSOM (@aussom_) February 10, 2026