నేనేక్కడికి వెళ్లను.. బీజేపీలోనే ఉంటా : విజయశాంతి
భాజపా నేత విజయశాంతి ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నారని, సోషల్ మీడియాలో ఓ వార్త హల్ చల్ చేస్తోంది. దీనిపై విజయశాంతి స్పందిస్తూ పార్టీ మార్పుపై వస్తున్న వార్తలను ఖండించారు. తాను పార్టీని వదలట్లేదని, భాజపాలోనే ఉంటానన్నారు. గత రెండు రోజుల నుంచి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. పార్టీతో అభిప్రాయభేదాలు ఉన్నాయని ప్రచారం నడుస్తోంది. అసలు ఇలాంటి ప్రచారం చేయడం సరైనదో కాదో ప్రచారం చేసేటోళ్లకే తెలియాలన్న రాములమ్మ, తానైతే మహాశివుడి కాశీ మహాపుణ్యక్షేత్రం, "గరళకంఠుడి" సన్నిధానంలో ఆ ఆది దేవుడి దర్శనార్థమై.. "హరహర మహాదేవ్'' అంటూ ట్వీట్ చేశారు. తనకు టీబీజేపీతో సమస్యలు ఉన్నట్లు టీఆర్‌ఎస్ సోషల్ మీడియా చేస్తున్న ప్రచారం అవాస్తవమని తేల్చి చెప్పారు.