Page Loader
అదానీ వ్యవహారంపై మౌనం వీడిన అమిత్ షా
అదానీ వ్యవహారంపై మాట్లాడిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా

అదానీ వ్యవహారంపై మౌనం వీడిన అమిత్ షా

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 14, 2023
01:19 pm

ఈ వార్తాకథనం ఏంటి

అదానీ గ్రూప్‌పై హిండెన్‌బర్గ్ ఇచ్చిన నివేదిక దేశ రాజకీయాల్లో ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ వ్యవహారంపై ధర్యాప్తు చేయాలని ప్రతిపక్షాలు ఇప్పటికే తమ గళాన్ని మారు మ్రోగించాయి. ప్రస్తుతం ఈ వ్యవహారంపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా మౌనం వీడారు. అదానీ వ్యవహారంలో బీజేపీ దాచడానికి, భయపడటానికి ఏం లేదని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం ఈ అంశం కోర్టు పరిధిలో ఉందని, తానేమీ మాట్లాడలేనని వెల్లడించారు. అదానీ ఎదుగుదలకు ప్రధాని సాయం చేస్తున్నారంటూ ప్రతిపక్షాలు చేస్తోన్న విమర్శలను అమిషా కొట్టిపారేశాడు. సుప్రీంకోర్టు ఈ అంశాన్ని విచారిస్తున్నప్పుడు ఓ మంత్రి తాను స్పందించడం మంచిది కాదన్నారు.

అమిత్ షా

కాంగ్రెస్ హాయంలోనే కుంభకోణాలు జరిగాయి: అమిత్ షా

గతంలో పెగాసస్ వ్యవహారం సమయంలోనూ కాంగ్రెస్ ఇలాంటి అరోపణలు చేసిందని అమిత్ షా గుర్తు చేశారు. ఒకవేళ ప్రతిపక్షాలు దగ్గర అధారాలుంటే నేరుగా కోర్టుకు వెళ్లానని, కోర్టులు తమ నియంత్రణలో ఉండవని, ఈ విషయం వారికి తెలియదా అని ప్రశ్నించాడు. కాంగ్రెస్ పార్టీకి గందరగోళం సృష్టించడమే తెలుసని, కాంగ్రెస్ హాయంలోనూ ఎన్నో కుంభకోణాలు జరిగాయని అమిత్ షా మండిపడ్డారు. అదానీ అంశంపై విపక్ష నేతలు పదే పదే అంతరాయం కలిగించడంతో రాజ్యసభ, లోక్‌సభ రెండూ మార్చి 13కి వాయిదా పడ్డాయి.