
BJP Foundation Day: 'నేషన్ ఫస్ట్' మంత్రమే బీజేపీ నినాదం: ప్రధాని మోదీ
ఈ వార్తాకథనం ఏంటి
భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అవినీతి, బాద్‌షా మనస్థతత్వంపై పోరాటానికి కట్టుబడి ఉందని ప్రధాని మోదీ పేర్కొన్నారు.
బీజేపీ 43వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా గురువారం మోదీ పార్టీ ఎంపీలను ఉద్దేశించి ప్రసంగించారు. బీజేపీ అన్నింటికంటే ముఖ్యం దేశమే అన్నారు.
అవినీతి, బంధుప్రీతి, శాంతిభద్రతల సవాళ్ల నుంచి భారత్‌ను పారదోలేందుకు పార్టీ కట్టుబడి ఉందని ప్రధాని అన్నారు. అందుకే 'నేషన్ ఫస్ట్' అనే మంత్రాన్ని నినాదంగా మార్చుకున్నట్లు చెప్పారు.
భారత్ ఎదుగుదలను హనుమాన్ జయంతిని పోలుస్తూ ప్రధాని మోదీ మాట్లాడారు. భారతదేశం హనుమంతుని శక్తి వలె తన సామర్థ్యాన్ని ఇప్పుడు గుర్తిస్తోందన్నారు. అవినీతి, శాంతిభద్రతల విషయంపై పోరాడటానికి బీజేపీ హనుమంతుడి నుంచి ప్రేరణ పొందిందన్నారు.
ప్రధాని మోదీ
బీజేపీ చేస్తున్న అభివృద్ధిని ప్రతిపక్షాలు జీర్ణించుకోలేకపోతున్నాయి: మోదీ
"బాద్‌షా" మనస్తతత్వం ఉన్న కొందరు 2014 నుంచి పేదలు, వెనుకబడిన వారిని అవమానిస్తున్నారని ప్రధాని మోదీ విమర్శించారు.
భారతదేశ అభివృద్ధిని తక్కువగా చూస్తున్న ప్రతిపక్షాలపై మోదీ ధ్వజమెత్తారు. పేదలకు చేసిన సేవను ప్రతిపక్షాలు అపహాస్యం చేస్తున్నాయని మండిపడ్డారు.
బీజేపీ చేస్తున్న అభివృద్ధిని ప్రతిపక్షాలు జీర్ణించుకోలేకపోతున్నాయని ప్రధాని మోదీ అన్నారు. ఆర్టికల్ 370 ఒకరోజు చరిత్ర అవుతుందని వారు (ప్రతిపక్షాలు) ఎన్నడూ ఊహించలేదన్నారు.
రాజకీయ ప్రయోజనాల కోసం మాత్రమే ప్రతిపక్షాలు సామాజిక న్యాయం నినాదాన్ని ఎంచుకుంటాయన్నారు. అందుకు భిన్నంగా సామాజిక న్యాయం, అన్ని వర్గాలకు ఉపాధి కల్పించడంతోపాటు 80 కోట్ల మందికి ఉచిత రేషన్‌ను ఎలాంటి వివక్ష లేకుండా బీజేపీ ప్రభుత్వం ఇస్తున్నట్లు చెప్పారు.