Page Loader
భాజపా అధిష్ఠానం కీలక నిర్ణయం.. 4 రాష్ట్రాలకు ఇన్‌ఛార్జ్‌ల నియామకం
4 రాష్ట్రాలకు ఇన్‌ఛార్జ్‌ల నియామకం

భాజపా అధిష్ఠానం కీలక నిర్ణయం.. 4 రాష్ట్రాలకు ఇన్‌ఛార్జ్‌ల నియామకం

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Jul 07, 2023
06:18 pm

ఈ వార్తాకథనం ఏంటి

భాజపా దిల్లీ పెద్దలు ఇటీవలే నాలుగు రాష్ట్రాల పార్టీ విభాగాలకు కొత్త రాష్ట్ర అధ్యక్షులను ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా ఆయా రాష్ట్రాలకు ఇన్‌ఛార్జ్‌లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. 1. తెలంగాణ - ప్రకాశ్ జావడేకర్ 2. ఛత్తీస్‌గఢ్‌ - ఓపీ మాథుర్‌ 3. మధ్యప్రదేశ్ - భూపేంద్ర యాదవ్‌ 4. రాజస్థాన్ - ప్రహ్లాద్‌ జోషీ తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో త్వరలోనే శాసనసభకు ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే ఆయా రాష్ట్రాల్లో కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల నగారా మోగించింది. ఈ మేరకు భారతీయ జనతా పార్టీ అధిష్ఠానం పలు రాష్ట్ర పార్టీల్లో కీలక మార్పులు చేర్పులకు పూనుకుంది.

DETAILS

తెలంగాణకు ఎన్నికల ఇన్‌ఛార్జ్‌గా కేంద్ర మాజీ మంత్రి ప్రకాశ్‌ జావడేకర్‌ నియామకం

నాలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆయా రాష్ట్రాలకు పార్టీ ఎన్నికల ఇన్‌ఛార్జ్‌లను భాజపా దిల్లీ పెద్దలు నియమించారు. తెలంగాణలో ఇటీవలే బండి సంజయ్‌ను రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తప్పించారు. అనంతరం ఆ బాధ్యతలను వెను వెంటనే కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డికి అప్పగించారు. ఈ మేరకు ఇప్పుడు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు.తెలంగాణకు ఎన్నికల ఇన్‌ఛార్జ్‌గా కేంద్ర మాజీ మంత్రి ప్రకాశ్‌ జావడేకర్‌ను నియమించింది. సదరు నియామకాలను పార్టీ జాతీయ అధ్యక్షుడు జగత్ ప్రకాశ్ నడ్డా చేపట్టారని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి అరుణ్‌సింగ్‌ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. మరోవైపు కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా తాజా మాజీ చీఫ్ బండి సంజయ్ కు బెర్త్ దక్కనున్నట్లు పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.