
కేంద్రమంత్రి పదవిపై దిల్లీ పెద్దల మాటకు కట్టుబడి ఉంటా : కిషన్ రెడ్డి
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణ భారతీయ జనతా పార్టీలో గత కొద్ది రోజులుగా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.
కమల దళంలోని రాజకీయాలు రోజుకో మలుపు తీసుకుంటున్నాయి. ఈ మేరకు ప్రజలు సైతం ఏం జరగనుందోనని ఆసక్తి కనబరుస్తున్నారు.
మరోవైపు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు ప్రకటించాక, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తొలిసారి స్పందించారు. ఈ మేరకు దిల్లీలో మీడియాతో మాట్లాడారు.
తాను పార్టీకి విధేయుడినని, క్రమశిక్షణ కలిగిన కార్యకర్తనని వెల్లడించారు. అధిష్ఠానం నిర్ణయం మేరకు ముందుకు సాగుతానని చెప్పారు.
జులై 8న వరంగల్‌లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సభ తర్వాత అధ్యక్ష బాధ్యతలు స్వీకరిస్తానన్నారు. కేంద్ర మంత్రి స్థానానికి సంబంధించి పార్టీ పెద్దలు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా, దానికి కట్టుబడి ఉంటానన్నారు.
DETAILS
మోదీ సభ కోసం జులై 8 వరకు వరంగల్ లోనే కిషన్ రెడ్డి మకాం
మరోవైపు ఇటీవలే జరిగిన కేంద్ర కేబినేట్ భేటీకి సైతం కిషన్ రెడ్డి గైర్హాజరయ్యారు. ఈ మేరకు దిల్లీలోని తన నివాసంలోనే ఉండిపోవడం గమనార్హం.
ఈ నేపథ్యంలోనే ఇవాళ సాయంత్రం ఆయన దిల్లీ నుంచి హైదరాబాద్ బయలుదేరనున్నారు.
ఈ క్రమంలోనే అందుబాటులో ఉన్న పార్టీ కీలక నేతలు, అధికార ప్రతినిధులు, జాతీయ కార్యవర్గ సభ్యులు సహా ఇతర ముఖ్య నేతలతో అత్యవసరగా భేటీ కానున్నారు. సమావేశంలో ప్రధాని మోదీ వరంగల్ పర్యటన ఏర్పాట్లపై చర్చించనున్నట్లు సమాచారం.
ఈ మేరకు గురువారం ఉదయం కిషన్ రెడ్డి వరంగల్ లో పర్యటించనున్నారు. అనంతరం రెండు రోజుల పాటు అంటే జులై 8 వరకు వరంగల్‌లోనే ఉండనున్నారని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.