
తెలుగు రాష్ట్రాలకు కొత్త అధ్యక్షులను నియమించిన బీజేపీ; తెలంగాణకు కిషన్ రెడ్డి, ఏపీకి పురందేశ్వరీ
ఈ వార్తాకథనం ఏంటి
భారతీయ జనతా పార్టీ(బీజేపీ) సంస్థాగతంగా సమూల మార్పుల దిశగా అడుగులు వేస్తోంది.
అసెంబ్లీ, సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని పలు రాష్ట్రాలకు కొత్త అధ్యక్షులను నియమించింది.
తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా జి.కిషన్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షురాలిగా డి.పురందేశ్వరిని జాతీయ ప్రెసిడెండ్ నడ్డా నియమించారు.
అలాగే జార్ఖండ్ రాష్ట్ర అధ్యక్షుడిగా మాజీ సిఎం బాబులాల్ మరాండీ, పంజాబ్ రాష్ట్ర అధ్యక్షుడిగా సునీల్ జాఖర్ నియమితులయ్యారు.
తెలంగాణలో ఎన్నికల నిర్వహణ కమిటీ అధ్యక్షుడిగా ఈటెల రాజేందర్‌ను పార్టీ నియమించింది.
తెలంగాణ నుంచి రాబోయే రోజుల్లో బండి సంజయ్ కేంద్ర ప్రభుత్వంలో మంత్రిగా చేరవచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
ఈ పరిణామం క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణ గురించి ఊహాగానాలకు మరింత ఆజ్యం పోస్తుంది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
పలు రాష్ట్రాలకు కొత్త అధ్యక్షులను ప్రకటించిన బీజేపీ
G Kishan Reddy has been appointed as BJP state president of Telangana, D Purandeshwari appointed as the state president of Andhra Pradesh BJP, former CM Babulal Marandi becomes the state president of Jharkhand, Sunil Jakhar - the party's state president of Punjab. pic.twitter.com/j4QSxZbFim
— ANI (@ANI) July 4, 2023