
ఈ నెల 8న ప్రధాని మోదీ వరంగల్ పర్యటన షెడ్యూల్ ఇదే
ఈ వార్తాకథనం ఏంటి
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 8న తెలంగాణలోని వరంగల్‌కు రానున్నారు. ఈ సందర్భంగా వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేయనున్నారు.
ఆ రోజు ఉదయం 9 గంటల 45 నిమిషాలకు ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌లోని హకీంపేట విమానాశ్రయానికి ప్రధాని మోదీ చేరుకుంటారు.
అక్కడి నుంచి హెలీకాప్టర్‌లో వరంగల్‌కు బయలుదేరుతారు. ఉదయం 10:35గంటలకు ప్రధాని మోదీ వరంగల్‌కు చేరుకుంటారు.
అనంతరం అక్కడి నుంచి సభా ప్రాంగణానికి వెళ్లే ముందు మోదీ భద్రకాళి ఆలయాన్ని సందర్శిస్తారు.
మోదీ
భద్రకాళి ఆలయంలో పూజలు చేయనున్న మోదీ
8న తేదీ ఉదయం 11 గంటల 30 నిమిషాలకు చేరుకొని అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం ప్రధాని మోదీ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.
మధ్యాహ్నం 12గంటల 10 నిమిషాల వరకు మోదీ ప్రసంగం ఉంటుంది. మధ్యాహ్నం 12గంటల 15 నిమిషాలకు ప్రధాని మోదీ తిరిగి వరంగల్ నుంచి హైదరాబాద్‌కు బయలుదేరుతారు.
మధ్యాహ్నం 1:10గంటలకు మోదీ హకీంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు.
అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో ప్రధాని రాజస్థాన్ పర్యటనకు వెళ్తారు. వరంగల్‌లో ప్రధాని మోదీ వ్యాగన్‌ల తయారీ యూనిట్‌కు శంకుస్థాపన చేయనున్నారు.
కేంద్రం ఏర్పాటు చేయనున్న యూనిట్‌లో నెలకు 200 వ్యాగన్‌లను తయారు చేయనున్నారు. అలాగే జాతీయ రహదారి ప్రాజెక్టులకు కూడా మోదీ శంకుస్థాపన చేయనున్నారు.