Page Loader
బీజేపీ మీటింగ్‌లో కాల్పుల కలకలం; కార్యకర్తకు గాయాలు 
బీజేపీ మీటింగ్‌లో కాల్పుల కలకలం; కార్యకర్తకు గాయాలు

బీజేపీ మీటింగ్‌లో కాల్పుల కలకలం; కార్యకర్తకు గాయాలు 

వ్రాసిన వారు Stalin
Jun 25, 2023
05:29 pm

ఈ వార్తాకథనం ఏంటి

బిహార్‌లోని మాధేపురా జిల్లా మురళిగంజ్‌లో జరిగిన బీజేపీ మీటింగ్‌లో తుపాకీ కాల్పులు కలకలం రేపాయి. ఈ ఘటనలో బీజేపీ కార్యకర్తకు గాయాలయ్యాయి. పంకజ్ పటేల్ అనే నిందితుడు పలు రౌండ్లు కాల్పులు జరిపినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం అతడిని అరెస్ట్ చేశారు. బీజేపీ సమావేశంలో పంకజ్ పటేల్ వర్గం, బాధితుడి వర్గం మధ్య వాగ్వాదం తరువాత కాల్పులు జరిగాయి. ఈ క్రమంలో నిందితుడు తన వద్ద ఉన్న లైసెన్స్ పిస్టల్‌తో పలు రౌండ్లు కాల్పులు జరిపాడు. ఈ ఘనటలో గాయపడిన బీజేపీ కార్యకర్తను సంజయ్ భగత్‌గా గుర్తించారు. అనంతరం భగత్‌ను ఆసుపత్రికి తరలించారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

బిహార్‌లో కాల్పుల మోత