పీఎఫ్‌ఐ విచారణ: బిహార్, యూపీ, పంజాబ్, గోవాలో ఎన్‌ఐఏ దాడులు
ఈ వార్తాకథనం ఏంటి
నిషేధిత పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్‌ఐ)ని లక్ష్యంగా చేసుకుని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) మంగళవారం ఉదయం నాలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తోంది.
బిహార్‌లోని 12 చోట్ల, ఉత్తరప్రదేశ్‌లోని రెండు చోట్ల, పంజాబ్‌లోని లూథియానా, గోవాలో ఒక్కో చోట ఎన్‌ఐఏ బృందాలు దాడులు నిర్వహిస్తున్నాయి.
పీఎఫ్‌ఐ సానుభూతిపరులతో పాటు నాయకులతో సంబంధం ఉన్నట్లు అనుమానిస్తున్న వారి ఇళ్లే లక్ష్యంగా ఎన్‌ఐఏ సోదాలు నిర్వహించిన్లు సమాచారం.
ఎన్ఐఏ
పీఎఫ్‌ఐ నేతలపై గత నెలలో ఐదు ఛార్జిషీట్లు
పీఎఫ్‌ఐతో సంబంధం ఉన్న వ్యక్తులు ఇచ్చిన సమాచారం ఆధారంగా దాడులు నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
ఉగ్రవాద మూలాలున్న పీఎఫ్‌ఐతో పాటు దాని అనుబంధ సంస్థలపై సెప్టెంబర్‌లో కేంద్ర ప్రభుత్వం నిషేదం విధించింది.
చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం కింద పీఎఫ్‌ఐపై నిషేధాన్ని మార్చిలో ధర్మాసనం సమర్థించింది. పీఎఫ్‌ఐ నేతలు, సభ్యులపై ఎన్‌ఐఏ గత నెలలో ఐదు ఛార్జిషీట్లు దాఖలు చేసింది.