
కోస్తా అంధ్ర సహా తూర్పు భారతాన్ని మరింత హడలెత్తించనున్న వేడిగాలులు
ఈ వార్తాకథనం ఏంటి
రాబోయే నాలుగు రోజుల్లో తూర్పు భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో వేడిగాలులు మరింత హడలెత్తించనున్నట్లు వాతావరణ కార్యాలయం సోమవారం తెలిపింది.
అలాగే రాబోయే రెండు రోజుల్లో దేశంలోని వాయువ్య ప్రాంతంలో హీట్ వేవ్ పరిస్థితులు నెలకొంటాయని అంచనా వేసింది.
గంగా నది తీరంలోని పశ్చిమ బెంగాల్, బిహార్‌లో నాలుగు రోజుల పాటు ఉష్ణోగ్రతలు పెరిగి, వేడిగాలులు వీస్తాయని వాతావరణ హెచ్చరించింది.
సిక్కిం, ఒడిశా, జార్ఖండ్‌లో కూడా రాబోయే రెండు, మూడు రోజుల్లో ఉష్ణోగ్రతలు పెరుగుతాయని అంచనా వేసింది.
ఏప్రిల్ 18-19 తేదీల్లో తూర్పు ఉత్తరప్రదేశ్ వేడి గాలులు కొనసాగుతాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది.
ఐఎండీ
పంజాబ్, హర్యానా, దిల్లీలో వర్షాలు
బెంగాల్‌లో గత ఆరు రోజులుగా, కోస్తా ఆంధ్రప్రదేశ్‌లో నాలుగు రోజులుగా, బీహార్‌లో మూడు రోజులుగా హీట్ వేవ్ పరిస్థితులు కొనసాగుతున్నాయని ఐఎండీ పేర్కొంది. రాబోయే రోజుల్లోనూ కొనసాగుతాయని చెప్పింది.
వాయువ్య భారతంలోని మైదానాల ప్రాంతాల్లో మంగళవారం నుంచి వాతావరణం మారే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. ఏప్రిల్ 18-20 మధ్య పంజాబ్, హర్యానా, దిల్లీ, రాజస్థాన్‌లలో చెదురుమదురు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
ఏప్రిల్ 18న జమ్ముకశ్మీర్, లద్దాఖ్‌లో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది.
హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లలో ఏప్రిల్ 18-19 తేదీల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ పేర్కొంది. రాబోయే రెండు, మూడు రోజుల్లో హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్‌లలో వడగళ్ల వానలు కురిసే అవకాశం ఉంది.