NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / అంతర్జాతీయం వార్తలు / Mpox:ఎంపాక్స్  కొత్త కోవిడ్-19 కాదు: WHO అధికారి 
    తదుపరి వార్తా కథనం
    Mpox:ఎంపాక్స్  కొత్త కోవిడ్-19 కాదు: WHO అధికారి 
    ఎంపాక్స్ కొత్త కోవిడ్-19 కాదు: WHO అధికారి

    Mpox:ఎంపాక్స్  కొత్త కోవిడ్-19 కాదు: WHO అధికారి 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Aug 20, 2024
    05:17 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ప్రపంచంలోని అనేక దేశాల్లో mpox వైరస్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి.

    ఇప్పుడు MPOXకి సంబంధించి WHO అధికారి ప్రకటన వెలువడింది. అధికారుల ప్రకారం, ఎంపాక్స్ కొవిడ్ కాదని, దాని వ్యాప్తిని నియంత్రించొచ్చని తెలిపింది.

    WHO అధికారి హాన్స్‌ క్లుగే మీడియాతో మాట్లాడుతూ..,"MPOX వ్యాప్తిని నియంత్రణ కోసం వ్యవస్థలను ఏర్పాటు చేస్తామన్నారు. ప్రపంచవ్యాప్తంగా MPOX ను ఎలా నిర్మూలించేందుకు నిర్ణయాత్మక చర్యలు తీసుకోవాలని కోరారు. భవిష్యత్తులోమనం ఈ వైరస్‌ను నియంత్రిస్తామా..మరోసారి నిర్లక్ష్యం, భయం వైపు వెళ్తామా..అనేది మన స్పందనపై ఆధారపడి ఉంటుంది. రానున్న ఏళ్లలో ఐరోపా, ప్రపంచానికి ఇది మరో పరీక్షే'' అని హెచ్చరించారు

    వివరాలు 

    ప్రతి నెలా 100కు పైగా కేసులు నమోదు  

    ఈ సమయంలో మా దృష్టి కొత్త క్లాడ్ 1 స్ట్రెయిన్‌పై ఉందని, యూరప్‌కు తక్కువ సీరియస్ క్లాడ్ 2పై దృష్టి సారించే అవకాశం ఉందని క్లూగే చెప్పారు.

    మెరుగైన ప్రజారోగ్య సలహా, పర్యవేక్షణతో సహా వైవిధ్యానికి ప్రాధాన్యత ఇవ్వబడింది. ఇప్పుడు యూరోపియన్ ప్రాంతంలో ప్రతి నెలా దాదాపు 100 కొత్త క్లాడ్ 2 Mpox స్ట్రెయిన్ కేసులు నమోదవుతున్నాయని క్లూగే చెప్పారు.

    మరోవైపు భారత్‌లోనూ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అన్ని అంతర్జాతీయ విమానాశ్రయాల్లో కేంద్ర ప్రభుత్వం నిఘా పెంచింది.

    మంకీపాక్స్ కారణంగా అంతర్జాతీయ ప్రయాణికుల పట్ల అప్రమత్తంగా ఉండాలని బంగ్లాదేశ్, పాకిస్థాన్ సరిహద్దులకు సమీపంలో ఉన్న అన్ని విమానాశ్రయాలతో పాటు ల్యాండ్ పోర్ట్‌ల అధికారులను కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కోరింది.

    వివరాలు 

    రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం సూచన

    మంకీ పాక్స్ వ్యాధిని ఎదుర్కోవడానికి ఢిల్లీలోని మూడు కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రులను నోడల్ కేంద్రాలుగా కేంద్ర ఆరోగ్యశాఖ గుర్తించింది.

    రామ్ మనోహర్ లోహియా హాస్పిటల్,సఫ్దర్‌జంగ్ హాస్పిటల్,లేడీ హార్డింగ్ హాస్పిటల్ లలో ఐసోలేషన్ కేంద్రాల ఏర్పాటు, చికిత్సకు ఏర్పాట్లు చేయనున్నది.

    నోడల్ కేంద్రాలు గుర్తించి మంకీ పాక్స్ వైరస్ ను గుర్తించడానికి సిద్ధంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం సూచించింది.

    వివరాలు 

     పాకిస్థాన్‌లో నలుగురికి  వైరస్‌ 

    ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం.. 2022 నుంచి ఇప్పటివరకు 116 దేశాలకు ఎంపాక్స్‌ వైరస్‌ విస్తరించగా.. మొత్తం 99,176 కేసులు నమోదయ్యాయి.

    ఈ మధ్యే కాంగోలో కూడా ఈ వ్యాధి వేగంగా వ్యాపిస్తోంది. ఈ సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే 15,600 కేసులు నమోదు కాగా 537 మంది మరణించారు.

    2022 నుండి ఇప్పటివరకు భారత్‌లో 30 ఎంపాక్స్‌ కేసులు రికార్డయ్యాయి. మార్చి 2024లో చివరి కేసు గుర్తించినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది.

    ఆ తర్వాత దేశంలో కొత్త కేసులు ఏవి నమోదు కాలేదని తెలిపింది. మరోపక్క పొరుగున ఉన్న పాకిస్థాన్‌లో నలుగురిలో ఈ వైరస్‌ను గుర్తించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ప్రపంచ ఆరోగ్య సంస్థ
    ప్రపంచ ఆరోగ్య సంస్థ

    తాజా

    Covid 19 : హాంకాంగ్, సింగపూర్ లో మళ్ళీ పెరుగుతున్న కోవిడ్ కేసులు కోవిడ్
    India Womens Squad : హర్మన్ ప్రీత్ సారథ్యంలో ఇంగ్లండ్ టూర్ కు వెళ్తున్న వుమెన్స్ జట్టు ఇదే.. బీసీసీఐ
    Turkey: టర్కీపై దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం.. ఒప్పందాలు రద్దు చేసుకుంటున్న భారత యూనివర్సిటీలు.. బాయ్‌కాట్‌ టర్కీ
    India Turkey: టర్కీకి బిగ్ షాక్ ఇచ్చిన భారత్.. విమానయాన సంస్థతో ఒప్పందం రద్దు.. కేంద్ర ప్రభుత్వం

    ప్రపంచ ఆరోగ్య సంస్థ

    హెటిరో కరోనా ఔషధం 'నిర్మాకామ్'కు డబ్ల్యూహెచ్ఓ ఆమోదం కోవిడ్
    చైనాపై పెరుగుతున్న ఆంక్షలు.. మరణాలపై తాజా డేటా ఇవ్వాలని కోరిన డబ్ల్యూహెచ్ఓ చైనా
    నోయిడాలో తయారు చేస్తున్న ఆ రెండు దగ్గు సిరప్‌లను పిల్లలకు ఉపయోగించొద్దు : డబ్ల్యూహెచ్‌ఓ ఉజ్బెకిస్తాన్
    చికెన్‌పాక్స్ కారణాలు, లక్షణాలు, చికిత్స గురించి తెలుసుకుందాం జబ్బు

    ప్రపంచ ఆరోగ్య సంస్థ

    అగ్రదేశాల్లో మరోసారి కరోనా కలకలం.. వేగంగా వ్యాపిస్తోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిక ప్రపంచ ఆరోగ్య సంస్థ
    వెలుగులోకి వచ్చిన కరోనా కొత్త వేరియంట్: జాగ్రత్తగా ఉండాలంటున్న WHO కోవిడ్
    Malaria Vaccine: మలేరియా వ్యాక్సిన్‌‌కు డబ్ల్యూహెచ్ఓ ఆమోదం ప్రపంచ ఆరోగ్య సంస్థ
    Tuberculosis: ప్రపంచంలో అత్యధికంగా క్షయవ్యాధి కేసులు ఉన్న దేశంగా భారత్ : ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రపంచ ఆరోగ్య సంస్థ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025