NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / అంతర్జాతీయం వార్తలు / సూడాన్ పోరాటంలో 413 మంది మృతి: డబ్ల్యూహెచ్‌ఓ
    తదుపరి వార్తా కథనం
    సూడాన్ పోరాటంలో 413 మంది మృతి: డబ్ల్యూహెచ్‌ఓ
    సూడాన్ పోరాటంలో 413 మంది మృతి: డబ్ల్యూహెచ్‌ఓ

    సూడాన్ పోరాటంలో 413 మంది మృతి: డబ్ల్యూహెచ్‌ఓ

    వ్రాసిన వారు Stalin
    Apr 24, 2023
    01:54 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    సూడాన్ జరుగుతున్న సాయుధ పోరాటంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) ఆవేదన వ్యక్తం చేసింది. సూడాన్ వివాదంలో 413 మంది మరణించారని పేర్కొంది.

    ఈ పోరాటంలో పిల్లలు అధిక మూల్యాన్ని చెల్లిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేసింది. సూడాన్ పోరులో కనీసం తొమ్మిది మంది మరణించారని, 50 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారని టర్కిష్ వార్తా సంస్థ ఏజెన్సీ అనడోలు నివేదించింది.

    సూడాన్‌లో జరుగుతున్న సాయుధ పోరాటంలో 3,551 మంది గాయపడినట్లు డబ్ల్యూహెచ్‌ఓ ప్రతినిధి మార్గరెట్ హారిస్ తెలిపారు. దేశ సైన్యం, పారామిలిటరీ ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ (ఆర్‌ఎస్‌ఎఫ్) మధ్య కొన్ని రోజులుగా భీకర పోరు జరుగుతోంది. ఈ పోరాటంలో సామాన్య ప్రజలు బలవుతున్నారు.

    సూడాన్

    ఇరు వర్గాల దాడులతో మూతపడుతున్నఆస్పత్రులు

    ఏప్రిల్ 15 నుంచి ప్రారంభమైన ఈ పోరాటంలో ఆస్పత్రులపై దాడులు చేస్తున్నట్లు మార్గరెట్ హారిస్ పేర్కొన్నారు.

    దాడుల కారణంగా 20పైగా ఆరోగ్య కేంద్రాల్లో విధులు నిలిచిపోయిటన్లు చెప్పారు. మరో 12 ఆస్పత్రులు త్వరలో సేవలను నిలిపివేసే ప్రమాదంలో ఉన్నాయని వెల్లడించారు.

    ఆస్పత్రులు మూతపడటం వల్ల పోరాటంలో గాయపడిన వారికి చికిత్స అందడంలో ఇబ్బంది అవతుందని, అలాగే అంతకు ముందు చికిత్స తీసుకునే వారు కూడా ప్రభావితమవుతారని హారిస్ ఆందోళన వ్యక్తం చేశారు.

    ఆహారం, నీరు, మందులు లేక పెద్దలు బాధపడుతున్నారని హారిస్ చెప్పుకొచ్చారు. సూడాన్‌లో పోషాకాహార లోపంతో బాధపడుతున్న 50,000 మంది పిల్లలను రక్షించడమే తమ లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    సూడాన్
    ప్రపంచ ఆరోగ్య సంస్థ
    తాజా వార్తలు

    తాజా

    Sreeleela : 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆలస్యం.. శ్రీలీల ఆళలపై నీళ్లు..! శ్రీలీల
    Srikanth: శ్రీకాంత్ కుటుంబానికి ప్రైవేట్ పూజలు.. వేద పండితుడిపై చర్యలు! శ్రీకాళహస్తి
    Russia-Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా భారీ డ్రోన్ దాడి.. ప్రతీకారంగా కీవ్‌ ఎదురుదాడులు ఉక్రెయిన్-రష్యా యుద్ధం
    Bharat Bandh: మావోయిస్టు అగ్రనేత మృతి.. భారత్ బంద్‌కు మావోయిస్టుల పిలుపు కేంద్ర ప్రభుత్వం

    సూడాన్

    సూడాన్‌లో చిక్కుకుపోయిన 4వేలమంది భారతీయులు; ప్రధాని మోదీ ఉన్నతస్థాయి సమావేశం  ప్రధాన మంత్రి

    ప్రపంచ ఆరోగ్య సంస్థ

    హెటిరో కరోనా ఔషధం 'నిర్మాకామ్'కు డబ్ల్యూహెచ్ఓ ఆమోదం కోవిడ్
    చైనాపై పెరుగుతున్న ఆంక్షలు.. మరణాలపై తాజా డేటా ఇవ్వాలని కోరిన డబ్ల్యూహెచ్ఓ చైనా
    నోయిడాలో తయారు చేస్తున్న ఆ రెండు దగ్గు సిరప్‌లను పిల్లలకు ఉపయోగించొద్దు : డబ్ల్యూహెచ్‌ఓ ఉజ్బెకిస్తాన్
    చికెన్‌పాక్స్ కారణాలు, లక్షణాలు, చికిత్స గురించి తెలుసుకుందాం జబ్బు

    తాజా వార్తలు

    రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు కరోనా పాజిటివ్  రాజ్‌నాథ్ సింగ్
    వివేకా హత్య కేసు: తెలంగాణ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులను సుప్రీంకోర్టులో సవాల్ చేసిన సునీత ఆంధ్రప్రదేశ్
    లండన్‌కు పారిపోయేందుకు అమృత్‌పాల్ సింగ్ భార్య ప్రయత్నం; అదుపులోకి తీసుకున్న పోలీసులు పంజాబ్
    పాఠశాలను బాగు చేయాలని మోదీని కోరిన విద్యార్థిని; స్పందించిన యంత్రాంగం జమ్ముకశ్మీర్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025