Cigarette: ఒక సిగరెట్‌తో 20 నిమిషాల ఆయుర్దాయం కోల్పోతారు.. ఆరోగ్య నిపుణుల హెచ్చరిక
ఈ వార్తాకథనం ఏంటి
ఒక సిగరెట్ తాగితే సగటున 20 నిమిషాల ఆయుర్దాయం కోల్పోతారని యూనివర్సిటీ కాలేజ్ లండన్ తాజా అధ్యయనం వెల్లడించింది.
పురుషులు సగటున 17 నిమిషాలు, మహిళలు 22 నిమిషాల జీవిత కాలాన్ని కోల్పోతారని ఈ అధ్యయనంలో పేర్కొన్నారు.
ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని, కొత్త సంవత్సరానికి ధూమపానాన్ని విడిచి పెట్టాలని పరిశోధకులు సూచిస్తున్నారు.
ఈ అధ్యయనంలో ధూమపానం వల్ల నష్టపోయే జీవిత కాలం గత అధ్యయనాలతో పోలిస్తే మరింత ఎక్కువగా ఉందని తేలడం గమనార్హం.
Details
ఒక సిగరెట్‌తో కాలం కరిగిపోతుంది
రోజుకు సుమారు 20 సిగరెట్లు ఉండే ఒక ప్యాకెట్‌ను పూర్తిగా తాగితే ఏకంగా ఏడుగంటల జీవిత కాలాన్ని కోల్పోవాల్సి వస్తుందని అధ్యయనం పేర్కొంది.
జీవిత కాలం మెరుగుపడాలంటే ధూమపానాన్ని పూర్తిగా మానేయడం అనివార్యమని పరిశోధకులు స్పష్టంచేశారు.
ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం, ధూమపానం కారణంగా ప్రతేడాది ప్రపంచవ్యాప్తంగా సుమారు 80 లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారు.
ఈ ప్రమాదకరమైన అలవాటు వీడితే జీవన నాణ్యత మెరుగుపడటంతో పాటు ఆయుర్దాయం కూడా పెరుగుతుందని అధ్యయనాలు సూచిస్తున్నాయి.