Tuberculosis: ప్రపంచంలో అత్యధికంగా క్షయవ్యాధి కేసులు ఉన్న దేశంగా భారత్ : ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక
2022లో ప్రపంచంలో అత్యధిక క్షయవ్యాధి (TB) కేసులు భారతదేశంలోనే ఉన్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ గ్లోబల్ TB నివేదిక 2023 పేర్కొంది. ప్రపంచంలోని మొత్తం టీబీ కేసుల్లో దేశంలోనే 27 శాతం ఉన్నాయి. 28.2 లక్షల కేసులు నమోదయ్యాయని,వారిలో 12 శాతం మంది (3,42,000 మంది) క్షయవ్యాధి కారణంగా మరణించారని మంగళవారం విడుదల చేసిన నివేదిక తెలిపింది. ప్రపంచంలోని టీబీ కేసుల్లో 87 శాతం 30 దేశాలలో ఉన్నాయని నివేదిక వెల్లడించింది. భారతదేశం తర్వాత ఇండోనేషియా (10 శాతం), చైనా (7.1 శాతం), ఫిలిప్పీన్స్ (7.0 శాతం), పాకిస్థాన్ (5.7 శాతం), నైజీరియా (4.5 శాతం), బంగ్లాదేశ్ (3.6 శాతం), డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో దేశాలు (3.0 శాతం) తో ఉన్నాయి.
చైనా 4 శాతంతో 14వ స్థానం
ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం కేసుల సంఖ్యను తగ్గించడంలో భారతదేశం పురోగతి సాధించింది. 2015లో 1,00,000 మందికి 258 మంది రోగులు ఉండగా, అది 2022లో 1,00,000 మందికి 199కి పడిపోయింది. అయితే ఈ రేటు ఇప్పటికీ ప్రపంచ సగటు 100,000కి 133 కంటే చాలా ఎక్కువగా ఉంది. కేస్ ఫెర్టిలిటీ రేషియో (CFR)ఇది వ్యాధి ఎంత తీవ్రంగా ఉందో చూపే కొలమానం. భారతదేశంలో 12 శాతం ఉంది, అంటే 100 మంది రోగులలో 12 మంది ఈ వ్యాధితో మరణిస్తారు. ఈ సంఖ్య ప్రపంచ సగటు 5.8 శాతం కంటే రెట్టింపు. సింగపూర్‌లో అత్యల్ప స్కోరు 1 శాతం ఉండగా, చైనా 4 శాతంతో 14వ స్థానంలో నిలిచింది. TB
COVID-19 మహమ్మారి పరిస్థితిని మరింత దిగజార్చింది
నయం చేయగలిగినప్పటికీ, ఆలస్యంగా నిర్ధారణ అయినప్పుడు మరణం సంభవించవచ్చు. కోవిడ్ మహమ్మారి సమయంలో,మరణాల సంఖ్య పెరుగుతుందని WHO నివేదిక అంచనా వేసింది. ప్రీ-పాండమిక్ ట్రెండ్‌లతో పోలిస్తే, 2020, 2022 మధ్య భారతదేశంలో దాదాపు 60,000 మంది మరణించారు. 2022లో 192 దేశాల నుండి 75 లక్షల మందికి పైగా ప్రజలు TBతో బాధపడుతున్నారని నివేదిక పేర్కొంది. 1995 నుండి ప్రపంచ వ్యాప్తంగా WHO ఈ వ్యాధిని పర్యవేక్షించడం ప్రారంభించినప్పటి నుండి ఇది అత్యధికంగా నమోదైంది. 2022లో నివేదిక ప్రకారం TB నిర్ధారణ,చికిత్స సేవల్లో రికవరీ ట్రెండ్‌ను హైలైట్ చేస్తోంది. TB నియంత్రణ ప్రయత్నాలపై COVID-19 ప్రభావం సంభావ్య తిరోగమనాన్ని సూచిస్తుంది.