China: అమెరికా డబ్ల్యూహెచ్‌వో నుంచి వైదొలగనున్నట్లు ట్రంప్ నిర్ణయం: చైనా కీలక ప్రకటన
ఈ వార్తాకథనం ఏంటి
ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) నుంచి అమెరికా వైదొలగాలని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయంపై చైనా స్పందించింది.
అమెరికా తప్పుకున్నా, డబ్ల్యూహెచ్‌వోకు తమ పూర్తి మద్దతు ఉంటుందని స్పష్టం చేసింది.
ట్రంప్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తరువాత అనేక ఆశ్చర్యకరమైన నిర్ణయాలు తీసుకున్న సంగతి తెలిసిందే.
వాటిలో ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి అమెరికా వైదొలగడం కూడా ఒకటి.
డబ్ల్యూహెచ్‌వోపై ట్రంప్ విమర్శలు
కొవిడ్-19 మహమ్మారి సమయంలో డబ్ల్యూహెచ్‌వో బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిందని ఆరోపిస్తూ ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇది అప్పట్లో ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
వివరాలు
చైనా మద్దతు ప్రకటన
ఈ పరిణామాల నేపథ్యంలో చైనా తన వైఖరిని స్పష్టం చేసింది. "ప్రపంచ ఆరోగ్య సంస్థను బలహీనపరచడం కాదు, బలోపేతం చేయాలి," అని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి జియాకున్ పేర్కొన్నారు.
డబ్ల్యూహెచ్‌వో కార్యకలాపాలకు చైనా నిరంతరం సహకరిస్తుందని, ఆరోగ్యకరమైన ప్రపంచం కోసం చైనా ఎల్లప్పుడూ కృషి చేస్తుందని ఆయన తెలిపారు.
మహమ్మారుల సమయంలో డబ్ల్యూహెచ్‌వో పాత్ర కీలకం
ప్రపంచ ఆరోగ్య సంస్థ అనేక దేశాలకు వైద్య సేవలు, పునరావాసం కల్పించడంలో కీలకంగా వ్యవహరిస్తోంది.
ఇలాంటి సమయంలో అమెరికా వంటి పెద్ద దేశం వెనక్కు తగ్గడం డబ్ల్యూహెచ్‌వో సామర్థ్యంపై ప్రభావం చూపిస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఈ ప్రకటనతో చైనా డబ్ల్యూహెచ్‌వోకు అండగా నిలిచినట్లు స్పష్టమవుతోంది.