Loading...
Kuldeep Yadav: న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌కు కుల్‌దీప్ దూరం.. గుర్నూర్ బ్రార్‌కు ఛాన్స్!
న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌కు కుల్‌దీప్ దూరం.. గుర్నూర్ బ్రార్‌కు ఛాన్స్!

Kuldeep Yadav: న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌కు కుల్‌దీప్ దూరం.. గుర్నూర్ బ్రార్‌కు ఛాన్స్!

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 14, 2026
11:18 am

ఈ వార్తాకథనం ఏంటి

న్యూజిలాండ్‌తో జరగనున్న రెండు టెస్టుల సిరీస్‌కు సంబంధించిన భారత జట్టులో కీలక మార్పు చోటుచేసుకుంది. స్పిన్నర్ కుల్‌దీప్ యాదవ్‌ను టెస్టు స్క్వాడ్ నుంచి తప్పిస్తూ టీమ్‌ఇండియా మేనేజ్‌మెంట్ నిర్ణయం తీసుకుంది. అతడి స్థానంలో యువ పేసర్ గుర్నూర్ బ్రార్‌కు అవకాశం కల్పించింది. వన్డే సిరీస్‌లో గుర్నూర్ బ్రార్ మెరుగైన బౌలింగ్ ప్రదర్శన చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో అతడిని టెస్టుల్లో ఆడిస్తే బాగుంటుందని మేనేజ్‌మెంట్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఐదో వన్డేలో బ్రార్ బరిలోకి దిగడని, టెస్టు జట్టుతో కలుస్తాడని బీసీసీఐ వెల్లడించింది. దీంతో అతడికి టెస్టు అరంగేట్రం చేసే అవకాశం లభించనుంది. ఆదివారం జరగనున్న చివరి వన్డే కోసం భారత్ మరో ఆటగాడిని జట్టులోకి తీసుకోనుంది.

వివరాలు

దేశవాళీ క్రికెట్ ఆడేందుకు కుల్‌దీప్‌కు అవకాశం

మరోవైపు స్టార్ ఆటగాడు రిషభ్ పంత్ ఇప్పటికే టెస్టు జట్టుతో చేరిపోయాడు.

న్యూజిలాండ్ గడ్డపై టెస్టు మ్యాచ్‌ల్లో రిస్ట్ స్పిన్నర్ కుల్‌దీప్ యాదవ్ పాత్ర పెద్దగా ఉండకపోవచ్చనే ఉద్దేశంతో మేనేజ్‌మెంట్ అతడిని జట్టు నుంచి విడుదల చేసింది.

ఇప్పటికే వన్డే సిరీస్‌లోనూ అతడికి కేవలం ఒక్కసారి మాత్రమే అవకాశం దక్కింది. ఆ మ్యాచ్‌లోనూ కుల్‌దీప్ భారీగా పరుగులు సమర్పించుకున్నాడు.

తాజాగా టీమ్‌ఇండియా టెస్టు స్క్వాడ్ నుంచి విడుదల కావడంతో దేశవాళీ క్రికెట్‌లో మ్యాచ్‌లు ఆడేందుకు కుల్‌దీప్ స్వదేశానికి వెళ్లనున్నట్లు బీసీసీఐ వెల్లడించింది.

ADVERTISEMENT