Andhra Medical College: ఆంధ్ర వైద్యకళాశాలకు జాతీయ స్థాయిలో 13వ ర్యాంకు.. ఏపీలో టాప్
ఈ వార్తాకథనం ఏంటి
ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్-2026 (IIFR) ర్యాంకింగ్స్‌లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఎనిమిది వైద్య కళాశాలలు చోటు దక్కించుకున్నాయి. తాజాగా ప్రకటించిన 144 ర్యాంకుల్లో రాష్ట్రంలోని వైద్య కళాశాలలు జాతీయ స్థాయిలో తమ సత్తా చాటాయి. విశాఖపట్నంలోని ఆంధ్ర మెడికల్ కాలేజీ ఆలిండియా 13వ ర్యాంకును సాధించి రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలిచింది. బోధన, విద్యా ప్రమాణాలు, పరిశోధన ఫలితాలు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్ ఉన్నత విద్యాసంస్థలకు ర్యాంకులను ప్రకటిస్తుంది.
వివరాలు
మంగళగిరిలోని ఎయిమ్స్‌కు 23వ స్థానం
తాజాగా విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో మంగళగిరిలోని ఎయిమ్స్ 23వ స్థానాన్ని దక్కించుకుంది. గుంటూరు వైద్య కళాశాల 50వ ర్యాంకు, కర్నూలు వైద్య కళాశాల 57వ ర్యాంకు సాధించాయి.
అలాగే కాకినాడలోని రంగరాయ వైద్య కళాశాల 59వ స్థానంలో నిలవగా.. తిరుపతిలోని ఎస్వీ వైద్య కళాశాల 69వ ర్యాంకును సొంతం చేసుకుంది.
ఇక విజయవాడలోని ప్రభుత్వ సిద్ధార్థ వైద్య కళాశాలకు 109వ ర్యాంకు, అనంతపురంలోని ప్రభుత్వ వైద్య కళాశాలకు 127వ ర్యాంకు లభించింది.
మొత్తంగా IIFR-2026 ర్యాంకింగ్స్‌లో ఏపీకి చెందిన ఎనిమిది వైద్య కళాశాలలు జాతీయ స్థాయిలో గుర్తింపు పొందాయి.