Page Loader
4 Day Work Week: యూకే సంస్థల సంచలన నిర్ణయం.. వారంలో నాలుగు రోజులు మాత్రమే పని
యూకే సంస్థల సంచలన నిర్ణయం.. వారంలో నాలుగు రోజులు మాత్రమే పని

4 Day Work Week: యూకే సంస్థల సంచలన నిర్ణయం.. వారంలో నాలుగు రోజులు మాత్రమే పని

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 28, 2025
08:46 am

ఈ వార్తాకథనం ఏంటి

భారత్‌ సహా ప్రపంచవ్యాప్తంగా పని గంటలపై చర్చ కొనసాగుతున్న సమయంలో, యూకేలో కొన్ని కంపెనీలు కీలకమైన నిర్ణయాలు తీసుకున్నాయి. వేతనంలో ఎలాంటి కోత లేకుండా, వారానికి నాలుగు పని దినాలను (4 Day Work Week) శాశ్వతంగా అమలు చేయడం మొదలుపెట్టాయి. పలు ప్రఖ్యాత ఛారిటీలు, మార్కెటింగ్‌, టెక్నాలజీ సంస్థలతో సహా మొత్తం 200 కంపెనీలు ఈ కొత్త విధానాన్ని అవలంభించినట్లు బ్రిటన్‌ మీడియా నివేదికలు పేర్కొన్నాయి. ఈ విషయాన్ని '4 డే వీక్ ఫౌండేషన్‌' నిర్వహించిన సర్వే ద్వారా తెలియజేశారు. ఈ కొత్త విధానంతో దాదాపు 5,000 మంది ఉద్యోగులు ప్రయోజనం పొందుతారని పేర్కొన్నారు.

Details

ఉద్యోగులు ఎక్కువ సమయం గడిపే అవకాశం

'4 డే వీక్ ఫౌండేషన్‌' క్యాంపెయిన్‌ డైరెక్టర్‌ జో రైల్‌ మాట్లాడుతూ వారానికి ఐదు రోజుల పని అనేవి వందేళ్ల క్రితం రూపొందిన పద్దతులని, ఇవి ప్రస్తుతం ఉన్న అవసరాలకు సరిపోవని తేల్చి చెప్పారు. ఇప్పుడు మనమంతా మారాలని అవసరం ఉందని, నాలుగు రోజుల పని విధానంతో ఉద్యోగులకు ఎక్కువ సమయం ఖాళీగా ఉంటుందని చెప్పారు. ఈ విధానాన్ని తొలుత బ్రిటన్‌లో 30 మార్కెటింగ్‌, అడ్వర్టైజింగ్‌, ప్రెస్‌ రిలేషన్స్‌ సంస్థలు అమలు చేశాయి. తర్వాత 29 ఛారిటీలు, 24 టెక్నాలజీ, ఐటీ, సాఫ్ట్‌వేర్‌ సంస్థలు, 22 మేనేజ్‌మెంట్‌, కన్సల్టింగ్‌ సంస్థలు కూడా దీనిని స్వీకరించాయి. లండన్‌ ప్రాంతంలో అత్యధికంగా 59 కంపెనీలు ఈ నూతన విధానాన్ని అనుసరిస్తున్నట్లు సర్వేలో తేలింది.