Murder In UK :కత్తితో పొడిచి...శరీరాన్ని ముక్కలు చేసి మిక్సీ ఆడేశాడు
బ్రిటన్ లో దారుణం చోటు చేసుకుంది. భార్యను పాశవికంగా హతమార్చాడు. అనంతరం భార్య శవాన్ని ముక్కలు ముక్కలు చేసి మిక్సర్ గ్రైండర్ లో వేసి పీస్ పీస్ చేసేశాడు. ఆలస్యంగా వెలుగు చూసిన మానవత్వానికే మచ్చతెచ్చే ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. బ్రిటన్ కు చెందిన నికోలస్ మెట్సన్ (28), హోలీ బ్రామ్లీ (26) దంపతులు. వీరిద్దరూ 16 నెలల క్రితం పెళ్లి చేసుకున్నారు. అప్పట్నుంచి బ్రామ్లీ కుటుంబసభ్యులను మెట్సన్ కలవనీయలేదు. పెళ్లైన దగ్గర్నుంచే వీరిద్దరూ కుటుంబాలకు దూరంగా ఉంటున్నారు. విపరీత మనస్తత్వం కలిగిన మెట్సన్ తరచూ భార్యను వేధిస్తూ ఉండేవాడు. పోలీసులు సాధారణ తనిఖీలకు వచ్చినప్పుడు మాత్రం తనను రోజూ తన భార్య వేధిస్తోందని, గృహ హింసను ఎదుర్కొంటున్నానని వారికి చెప్పేవాడు.
శవాన్ని మాయం చేసేందుకు మిత్రుడి సాయం తీసుకున్న మెట్సన్
బ్రామ్లీ కూడా మానసిక సమస్యలతో బాధపడుతూ వైద్యుల దగ్గర చికిత్స తీసుకునేది. వారం క్రితం ఇద్దరి మధ్యా ఘర్షణ తలెత్తడంతో మెట్సన్ తన భార్యను కత్తితో దాడి చేశాడు. అనంతరం ఆమె మృతదేహాన్నికట్ చేసి కొన్ని గ్రైండర్ లో వేసేశాడు. మరికొన్ని శరీర భాగాలను ప్లాస్టిక్ కవర్ లో పెట్టి ఫ్రిజ్ లో దాచాడు. ఈ విషయాన్ని మెట్సన్ తన మిత్రుడికి చెప్పి శవాన్ని మాయం చేసేందుకు సహాయాన్ని కోరాడు. అందుకు 50 డాలర్ల వరకూ డబ్బులు కూడా చెల్లిస్తానని చెప్పాడు. ఈ విషయాన్ని ఫోన్ ద్వారా మెట్సన్ మెస్సేజ్ మిత్రుడికి చేశాడు. అందుకు అంగీకరించిన మిత్రుడు కూడా ప్లాస్టిక్ బ్యాగ్ లో పెట్టిన శరీర భాగాలను స్థానికంగా వితమ్ నదిలో పడేశాడు.
పోలీసులు తనదైన శైలిలో విచారిండంతో నేరం ఒప్పుకున్న మెట్సన్
కొద్ది రోజులుగా ఆమె కన్పించడకపోవడం, ఇంటి నుంచి దుర్వాసన వస్తుండటంతో స్థానికులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు మెట్సన్ ఇంటికి వెళ్లి పరిశీలించారు. అక్కడ కొన్ని శరీర భాగాలు కన్పించాయి. పోలీసులు తనదైన శైలిలో విచారణ చేయడంతో మొత్తం విషయమంతా మెట్సన్ కక్కేశాడు. వితమ్ నది ఒడ్డున మార్నింగ్ వాక్ కు వెళ్లే వారికి ప్లాస్టిక్ కవర్ లో శరీరభాగాలు కనిపించగా వారు పోలీసులకు సమాచారమిచ్చారు. అక్కడకు వెళ్లిన పోలీసులు వాటిని స్వాధీనం చేసుకుని ల్యాబ్ కు పంపించారు. బ్రామ్లీకి శరీరానికి సంబంధించి ఇంకా 224 శరీరభాగాలు పోలీసులకు దొరకలేదు. అయితే బ్రామ్లీని మెట్సన్ ఎలా చంపిందీ తెలియాలంటే అవి దొరికితేనే నేరం ఆధారాలతో సహా కోర్టులో రుజువు చేయగల్గుతామని పోలీసులు చెబుతున్నారు.