
British MP: POK ని వెనక్కి తీసుకోవడం ఒక్కటే పరిష్కారం .. భారత్‌కు బ్రిటిష్ ఎంపీ సూచన
ఈ వార్తాకథనం ఏంటి
దేశవ్యాప్తంగా పహల్గాం ఉగ్రదాడిని ప్రజలు గట్టిగా ఖండిస్తున్న విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో భారత మూలాలను కలిగిన బ్రిటిష్ పార్లమెంటు సభ్యుడు లార్డ్ మేఘనాథ్ దేశాయ్ ఇటీవల స్పందించారు.
కశ్మీర్ సమస్యకు శాశ్వత పరిష్కారంగా పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే)ను పూర్తిగా భారత్‌లో కలిపివేయాలని ఆయన భారత ప్రభుత్వానికి సూచించారు.
అదే కశ్మీర్‌కు సంబంధించిన అన్ని సమస్యల మూలాన్ని తొలగించగలదని అభిప్రాయపడ్డారు.
ఉగ్రవాద కార్యకలాపాలను కట్టడి చేయాలంటే భారత్ దృఢంగా స్పందించాలని, ఇలాంటి దాడులు మళ్లీ జరుగకుండా నిరోధించాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు.
వివరాలు
కశ్మీర్ సమస్యకు ఒక ముగింపు కావాలన్న ఆశ
పీఓకే ఎప్పటికీ భారత్‌దేనన్న నమ్మకాన్ని వ్యక్తంచేసిన మేఘనాథ్ దేశాయ్, పహల్గాం ఘటనలో అమాయక పర్యాటకులపై జరిగిన దాడి అమానుషమైనదని ఆవేదనతో తెలిపారు.
ఈ దుర్ఘటన కశ్మీర్ సమస్యకు ఒక ముగింపు కావాలన్న ఆశను వ్యక్తంచేశారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం తప్పనిసరిగా కఠిన చర్యలు తీసుకుంటుందన్న విశ్వాసం తనకు ఉందని చెప్పారు.
ఇప్పటికే మోదీ పలు సందర్భాల్లో కశ్మీర్ సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలనే సంకల్పాన్ని వ్యక్తపరచారని గుర్తు చేశారు.
వివరాలు
భారత పోరాటానికి బ్రిటన్ మద్దతు
పహల్గాం ఉగ్రదాడిపై భారత్‌కు మద్దతుగా బ్రిటన్ ప్రభుత్వం స్పందించింది.దాడికి పాల్పడిన నిందితులకు కఠిన శిక్షలు విధించాలని తాము భారత ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు కెనడా విదేశాంగ శాఖ ప్రతినిధి ప్రకటించారు.
ఉగ్రవాద నిర్మూలనలో భారత్‌కు తమ దేశం పూర్తి సహకారం అందించనున్నదని చెప్పారు.
ఇటీవల లండన్‌లో భారతీయులు ఈఘటనను వ్యతిరేకిస్తూ ఆందోళన చేపట్టిన సమయంలో, అక్కడి పాకిస్తాన్ హైకమిషన్ అధికారి ఆందోళనకారులను బెదిరించినట్లు వీడియోలు బయటకు రావడం ఆందోళన కలిగించిందన్నారు.
ఈవిషయంపై విచారణ కొనసాగుతోందని తెలిపారు.బ్రిటన్‌కు భారత్, పాకిస్తాన్‌తో మంచి సంబంధాలు ఉన్నాయని,ఈరెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు తలెత్తకూడదన్నదే తమ ఆకాంక్ష అని పేర్కొన్నారు.
కశ్మీర్ ప్రజల అభిప్రాయాలను గౌరవించి,వారు ఎదుర్కొంటున్న సమస్యలకు శాశ్వత పరిష్కారం కనుగొనటంలో భారత్-పాకిస్తాన్ ప్రభుత్వాలు తమ పాత్రను నిర్వర్తించాలన్నారు.