Page Loader
Manchester United stadium:ఆ ఒక్క ఫుట్‌బాల్‌ మైదానంతో బ్రిటిన్‌కు ఏటా రూ.81 వేల కోట్ల ఆదాయం!
ఆ ఒక్క ఫుట్‌బాల్‌ మైదానంతో బ్రిటిన్‌కు ఏటా రూ.81 వేల కోట్ల ఆదాయం!

Manchester United stadium:ఆ ఒక్క ఫుట్‌బాల్‌ మైదానంతో బ్రిటిన్‌కు ఏటా రూ.81 వేల కోట్ల ఆదాయం!

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 24, 2024
05:14 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆటలపై పెట్టుబడులు ఎందుకు పెట్టాలని అనుకునే వారికి తాజాగా ఆక్స్‌ఫర్డ్‌ ఎకనామిక్స్‌ రిపోర్టు చూస్తే కళ్లుతేలేస్తారు. ఒక ఫుట్‌ బాల్‌ మైదానాన్ని ఆధునికీకరిస్తే బ్రిటన్‌కు ఏడాదికి ఏకంగా రూ.81 వేల కోట్ల ఆదాయం లభిస్తుందని ఆ రిపోర్టు వెల్లడించింది. ప్రత్యేకంగా, మాంచెస్టర్‌ యునైటెడ్‌ క్లబ్‌ ఆధీనంలోని ప్రఖ్యాత 'ఓల్డ్ ట్రాఫోర్డ్‌' మైదానానికి సంబంధించిన ఆధునికీకరణ ప్రాజెక్టు ఇప్పుడు బ్రిటన్‌లో సంచలనంగా మారింది. మాంచెస్టర్‌ యునైటెడ్‌ సహ యజమాని, బిలియనీర్‌ జిమ్ రాట్‌క్లిఫ్ ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళుతున్నారు.

Details

 100,000 సీట్ల సామర్థ్యంతో మైదానం

రూ.2 బిలియన్‌ డాలర్లతో ఓల్డ్‌ ట్రాఫోర్డ్‌ను 100,000 సీట్ల సామర్థ్యంతో సరికొత్తగా రూపొందిస్తున్నారు. ప్రస్తుతం 74,000 సీట్ల సామర్థ్యాన్ని పెంచే ప్రతిపాదనను కూడా పరిశీలిస్తున్నారు. ఈ ప్రాజెక్టు కేవలం మైదానం ఆధునికీకరణకే పరిమితం కాకుండా, చుట్టుపక్కల అపార్ట్‌మెంట్లు, షాపింగ్‌ కాంప్లెక్స్‌లు, ట్రాన్స్‌పోర్టు వంటి సౌకర్యాలను అభివృద్ధి చేయడం లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆక్స్‌ఫర్డ్‌ ఎకనామిక్స్‌ సంస్థ చేపట్టిన ఈ ప్రాజెక్టు ఫీజబులిటీ స్టడీ ప్రకారం ఈ ప్రణాళికలతో గ్రేటర్ మాంచెస్టర్ ప్రాంతానికి పెద్ద ఎత్తున ఆర్థిక, సామాజిక వృద్ధి జరుగుతుందని అంచనా వేశారు.

Details

కొత్తగా 92వేల ఉద్యోగాలు

ఈ ప్రాజెక్టు ద్వారా 92,000 కొత్త ఉద్యోగాలు లభించనున్నాయి. అలాగే 17,000 కొత్త ఇళ్ల నిర్మాణాలు కూడా జరుగుతాయని ఆ రిపోర్టులో వెల్లడించారు. ఈ ఆధునికీకరణ ప్రాజెక్టు, మాంచెస్టర్ ప్రాంతానికి మాత్రమే కాకుండా బ్రిటన్ ఆర్థిక వ్యవస్థకూ పెద్ద ప్రయోజనం అందించనుంది. గ్రేటర్‌ మాంచెస్టర్‌ మేయర్‌ ఆండీ బర్న్‌హమ్ ఈ ప్రణాళికలకు తన మద్దతు తెలియజేశారు. ఇది బ్రిటన్‌లో అత్యంత పెద్ద ఆధునికీకరణ ప్రాజెక్టుగా మారుతుందని, ఫుట్‌బాల్ మైదానం మాత్రమే కాకుండా స్థానిక ప్రజలు కూడా ఈ ప్రాజెక్టు నుంచి లాభపడతారని పేర్కొన్నారు. ప్రముఖ ఆర్కిటెక్ట్ సంస్థ 'ఫోస్టర్‌ అండ్‌ పార్టనర్స్‌' ఈ ప్రాజెక్టుపై పనిచేస్తోంది.