Page Loader
Tom Wilkinson Death: ప్రముఖ నటుడు కన్నుమూత.. విషాదంలో చత్రసీమ 
Tom Wilkinson Death: ప్రముఖ నటుడు కన్నుమూత.. విషాదంలో చత్రసీమ

Tom Wilkinson Death: ప్రముఖ నటుడు కన్నుమూత.. విషాదంలో చత్రసీమ 

వ్రాసిన వారు Stalin
Dec 31, 2023
10:08 am

ఈ వార్తాకథనం ఏంటి

ప్రముఖ బ్రిటిష్ నటుడు టామ్ విల్కిన్సన్ (75) శనివారం కన్నుమూశారు. ఈ మేరకు కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఇంట్లోనే ఆయన తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. అయితే చనిపోవడానికి కారణం ఏంటనేది వెల్లడించలేదు. టామ్ రెండుసార్లు ఆస్కార్‌కు నామినేట్ అయ్యారు. 'ది ఫుల్ మాంటీ', 'మైఖేల్ క్లేటన్', 'ది బెస్ట్ ఎక్సోటిక్ మేరిగోల్డ్ హోటల్'లో పోషించిన పాత్రలు విల్కిన్సన్‌కు ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చాయి. విల్కిన్సన్ 2001లో వచ్చిన ఫ్యామిలీ డ్రామా 'ఇన్ ది బెడ్‌రూమ్'లో అత్యుత్తమ నటనకు గానూ ఉత్తమ నటుడి విభాగంలో అస్కార్ అకాడమీ అవార్డుకు నామినేట్ అయ్యారు. అలాగే 2007లో 'మైఖేల్ క్లేటన్'లో తన పాత్రకు ఉత్తమ సహాయ నటుడి విభాగంలో ఆస్కార్‌కు నామినేట్ అయ్యారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

75ఏళ్ల వయసులో కన్నుమూత