Rishi Sunak: 'నమస్కారం చేయి' రిషి సునాక్ కు అత్త సూచన
ఈ వార్తాకథనం ఏంటి
బ్రిటన్ మాజీ ప్రధాని రిషి సునాక్ శనివారం జైపూర్‌లో జరిగిన లిటరేచర్ ఫెస్టివల్‌లో పాల్గొన్నారు. ఆయనతో పాటు సతీమణి అక్షతా మూర్తి, ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
అయితే, ఈ వేడుకలో ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఈ ఫెస్టివల్‌లో రిషి సునాక్ కూర్చొని ఉండగా సభలోని వారికి అభివాదం చేశారు.
అయితే ఇన్ఫోసిస్ ఫౌండేషన్ ఛైర్‌పర్సన్ సుధామూర్తి సోదరి సునందా కులకర్ణి ఆయనను వారిస్తూ, లేచి నిలబడి నమస్కారం చేయాలని సూచించారు.
దాంతో సునాక్ వెంటనే లేచి నిలబడి అందరికీ నమస్కారం చేసి అభివాదం చేశారు. ఈ ఘటన అనంతరం వారిద్దరూ నవ్వుకుని సరదాగా వ్యవహరించారు.
Details
వివిధ రకాలుగా స్పందించిన నెటిజన్లు
ఈ సంఘటనకు సంబంధించిన వీడియోను ఓ వార్తా సంస్థ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అది వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.
జైపూర్‌లోని ఐకానిక్ హోటల్ క్లార్క్స్ అమెర్‌లో గురువారం లిటరేచర్ ఫెస్టివల్ ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో రాజకీయ, సినీ, సాహిత్య రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు హాజరయ్యారు.
శనివారం 300 మందికి పైగా ప్రముఖులు ఈ వేడుకలో పాల్గొన్నారు.
ఈ ఫెస్టివల్‌కు హాజరైన ప్రముఖుల్లో ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి, ఆయన సతీమణి సుధామూర్తి, బ్రిటన్ మాజీ ప్రధాని రిషి సునాక్, యూఎస్ దౌత్యవేత్త ఎరిక్ గార్సెట్టి పాల్గొన్నారు.