English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / అంతర్జాతీయం వార్తలు / King Charles III: కెనడాను అమెరికాలో చేరాలని ట్రంప్ ఒత్తిడి.. బ్రిటన్ రాజు కింగ్ చార్లెస్ కీలక వ్యాఖ్యలు
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    King Charles III: కెనడాను అమెరికాలో చేరాలని ట్రంప్ ఒత్తిడి.. బ్రిటన్ రాజు కింగ్ చార్లెస్ కీలక వ్యాఖ్యలు
    కెనడాను అమెరికాలో చేరాలని ట్రంప్ ఒత్తిడి..

    King Charles III: కెనడాను అమెరికాలో చేరాలని ట్రంప్ ఒత్తిడి.. బ్రిటన్ రాజు కింగ్ చార్లెస్ కీలక వ్యాఖ్యలు

    వ్రాసిన వారు Sirish Praharaju
    May 28, 2025
    09:38 am

    ఈ వార్తాకథనం ఏంటి

    అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ ఇటీవల కెనడాను అమెరికాలో 51వ రాష్ట్రంగా కలిపేందుకు చేస్తున్న వ్యాఖ్యలు, బెదిరింపుల నేపథ్యంలో, బ్రిటన్ రాజు కింగ్ చార్లెస్ III ఓటావాలో జరిగిన కెనడా పార్లమెంటు ప్రారంభ సభలో కెనడాను సమర్థవంతమైన, స్వతంత్ర దేశంగా కొనియాడారు.

    దేశాధిపతిగా కెనడా ప్రధాని మార్క్ కార్నీ ఆహ్వానంపై ఈ కార్యక్రమానికి హాజరైన చార్లెస్, అంతర్జాతీయంగా మారుతున్న సంబంధాలు, ముఖ్యంగా అమెరికాతో ఉన్న రాజకీయ సంబంధాలపై కీలక వ్యాఖ్యలు చేశారు.

    వివరాలు 

    ది ట్రూ నార్త్ ఈజ్ ఇండీడ్ స్ట్రాంగ్ అండ్ ఫ్రీ

    చార్లెస్ మాట్లాడుతూ ప్రజాస్వామ్యం, చట్టాల పాలన, స్వయంప్రతిపత్తి, వ్యక్తిగత స్వేచ్ఛలను కెనడియన్లు అత్యంత విలువగా భావిస్తారని, ఇవి కాపాడటం ప్రభుత్వ ప్రధాన బాధ్యత అని స్పష్టం చేశారు.

    కెనడా ప్రస్తుతం ఎంతో కీలకమైన దశలో ఉందని పేర్కొన్నారు.

    "ది ట్రూ నార్త్ ఈజ్ ఇండీడ్ స్ట్రాంగ్ అండ్ ఫ్రీ" అనే కెనడా జాతీయ గీతంలోని పంక్తిని ప్రస్తావిస్తూ, దేశం స్వాతంత్ర్య భావనను హైలైట్ చేశారు.

    ట్రంప్ చేసిన హెచ్చరికల గురించి రాజు నేరుగా స్పందించకపోయినా, ఆయన ప్రసంగంలోని కొన్ని మాటలు మాత్రం చక్కటి సంకేతాలను ఇస్తున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

    అంతేగాక, బ్రిటన్ రాజు గ్లోబల్ ట్రేడ్ వ్యవస్థపై తన ఆందోళనను వ్యక్తం చేశారు.

    మీరు
    50%
    శాతం పూర్తి చేశారు

    వివరాలు 

    70 ఏళ్ల తర్వాత తొలిసారి

    గతంలో ప్రపంచానికి, కెనడియన్లకు అభివృద్ధిని అందించిన ఓపెన్ గ్లోబల్ వాణిజ్య వ్యవస్థ ఇప్పుడు మారుతున్నదని చెప్పారు.

    ఈ వ్యవస్థ పరిపూర్ణం కాకపోయినా, దీని వల్లనే గత కొన్ని దశాబ్దాల్లో కెనడా పురోగతి సాధించిందని పేర్కొన్నారు.

    ప్రపంచం ప్రస్తుతం ముందు ఎన్నడూ లేనంతగా ప్రమాదకరమైన, అనిశ్చిత పరిస్థితుల్లోకి వెళ్తుందని రాజు హెచ్చరించారు.

    కెనడా పార్లమెంటు ప్రారంభోత్సవానికి బ్రిటన్ రాజు హాజరవడం ఇది 70 ఏళ్ల తర్వాత తొలిసారి.

    ప్రస్తుతం పార్లమెంటు భవనం మరమ్మతులలో ఉండడంతో, ఈ ఉత్సవ కార్యక్రమాన్ని ఓటావాలోని పాత రైల్వే స్టేషన్‌లో నిర్వహించారు.

    ఈ ప్రత్యేక సభకు మాజీ ప్రధాన మంత్రులు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, తాత్కాలిక ప్రతిపక్ష నాయకులు, స్థానిక ఆదివాసీ నాయకులు కూడా హాజరయ్యారు.

    మీరు పూర్తి చేశారు
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    బ్రిటన్
    కెనడా

    తాజా

    Bengaluru stampede: ఆర్సీబీ వేడుకలో తొక్కిసలాట.. ప్రభుత్వానికి 9 ప్రశ్నలు సంధించిన హైకోర్టు కర్ణాటక
    MUDA Scam: ముడా కేసులో మరో 92కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేసిన ED.. మొత్తం జప్తు విలువ రూ.400 కోట్లు కర్ణాటక
    Cyber ​​criminals: సుప్రీంకోర్టు పేరుతో భారీ మోసం.. రిటైర్డ్ ఇంజనీర్ నుంచి కోటి 50 లక్షలు కాజేసిన సైబర్ కేటుగాళ్లు!  సుప్రీంకోర్టు
    Godavari Pushkaralu 2027: త్వరలో గోదావరి పుష్కరాలు.. ఇప్పటి నుంచి ఏర్పాట్లపై ఏపీ సర్కార్ దృష్టి  ఆంధ్రప్రదేశ్

    బ్రిటన్

    Tom Wilkinson Death: ప్రముఖ నటుడు కన్నుమూత.. విషాదంలో చత్రసీమ  హాలీవుడ్
    Houthis: యెమెన్‌లో హౌతీలే లక్ష్యంగా అమెరికా, బ్రిటన్ ప్రతీకార దాడి హౌతీ రెబెల్స్
    పారాచూట్ ఫెయిల్.. 29 అంతస్తుల భవనంపై నుంచి పడి బ్రిటిష్ స్కైడైవర్ దుర్మరణం థాయిలాండ్
    King Charles III: బ్రిటన్ రాజు చార్లెస్‌కు క్యాన్సర్.. బకింగ్‌హామ్ ప్యాలెస్ ప్రకటన  లండన్

    కెనడా

    Justin Trudeau: కెనడా రాజకీయాల్లో కీలక పరిణామం.. ప్రధాని పదవికి జస్టిన్‌ ట్రూడో రాజీనామా! జస్టిన్ ట్రూడో
    Canada: ట్రూడో రాజీనామా.. కెనడా ప్రధాని పదవికి భారత సంతతి నేతల పోటీ జస్టిన్ ట్రూడో
    #NewsBytesExplainer:గ్రీన్ ల్యాండ్, పనామా కెనాల్ ల విషయంలో ట్రంప్ బెదిరింపులు..ఎందుకంటే? డొనాల్డ్ ట్రంప్
    Chandra Arya:కెనడా ప్రధాని రేసులో నేనున్నానంటూ భారత సంతతి ఎంపీ చంద్ర ఆర్య ప్రకటన!   అంతర్జాతీయం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025