LOADING...
UK Prince: రాయల్ ఫ్యామిలీకి షాక్‌.. సెక్స్‌ కుంభకోణంలో ప్రిన్స్‌ ఆండ్రూ పేరు!
రాయల్ ఫ్యామిలీకి షాక్‌.. సెక్స్‌ కుంభకోణంలో ప్రిన్స్‌ ఆండ్రూ పేరు!

UK Prince: రాయల్ ఫ్యామిలీకి షాక్‌.. సెక్స్‌ కుంభకోణంలో ప్రిన్స్‌ ఆండ్రూ పేరు!

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 18, 2025
11:42 am

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికాలో వెలుగులోకి వచ్చిన సెక్స్‌ కుంభకోణం కేసు పత్రాలు గ్లోబల్‌ ఎలైట్‌లో దారుణ షాక్‌ సృష్టించాయి. ఈ పత్రాల్లో మాజీ అధ్యక్షుడు బిల్‌ క్లింటన్‌, ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, పాప్‌ సింగర్ మైఖేల్‌ జాక్సన్‌తో పాటు దాదాపు 200 మంది శక్తివంతులు, ధనవంతుల పేర్లు ఉన్నట్లు బయటపడ్డాయి. తాజాగా ఈ పత్రాల్లో బ్రిటన్ యువరాజు ప్రిన్స్‌ ఆండ్రూ(Prince Andrew)పేరు కూడా బయటకు వచ్చింది. ఈ పరిణామాల నేపథ్యంలో ప్రిన్స్‌ ఆండ్రూ తన 'డ్యూక్ ఆఫ్ యార్క్' రాయల్ టైటిల్‌ను వదులుకోవాల్సి వచ్చింది. బ్రిటన్ రాజు చార్లెస్‌IIIఒత్తిడితో ఆయన ఈ బిరుదును త్యజించారట. ఇకపై ఆండ్రూ తన బిరుదును, తనకు లభించే గౌరవాలను ఉపయోగించని నిర్ణయం తీసుకున్నట్లు సోషల్‌ మీడియా ద్వారా ప్రకటించారు.

Details

అఘాయిత్యాలకు పాల్పడినట్లు అరోపణలు

ఈ నిర్ణయం కుటుంబ సభ్యులతో, బ్రిటన్ రాజు చార్లెస్‌ IIIతో చర్చల తర్వాత తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. తనపై ఆరోపణల కారణంగా రాజ కుటుంబ కార్యకలాపాలకు ఏ విధమైన ఆటంకం కలగకుండా ఉంచడం లక్ష్యంగా ఉంది. ఎప్‌స్టీన్‌ సెక్స్‌ కుంభకోణం ఇప్పటికే అంతర్జాతీయ రాజ్యాంగాన్ని కుంభకోణంలోకి దింపారు. పేద,మధ్యతరగతి యువతులను ఫ్లోరిడా, న్యూయార్క్‌, వర్జిన్‌ ఐలాండ్స్‌, మెక్సికోలోని నివాసాలకు పిలిపించి అఘాయిత్యాలకు పాల్పడినట్లు ప్రధాన ఆరోపణలున్నాయి. ఈ కేసులో జొహన్నా సోబెర్గ్‌ ఇచ్చిన వాంగ్మూలంలో ప్రిన్స్‌ ఆండ్రూపై సంచలన ఆరోపణలు చేశారు. 2001లో న్యూయార్క్‌ వెళ్లినప్పుడు ఎప్‌స్టీన్ నివాసంలో ఫోటో తీయబడ్డ సమయంలో ప్రిన్స్‌ ఆండ్రూ అసభ్యంగా తాకాడని పేర్కొన్నారు. వాంగ్మూలంలో క్లింటన్‌, ట్రంప్‌ల పేర్లను కూడా ప్రస్తావించడంతో చర్చలకు దారి తీసింది.