Page Loader
బ్రిటన్​ పార్లమెంట్​ ఎన్నికల్లో తెలుగు బిడ్డ - పీవీ బంధువు కూడా..

బ్రిటన్​ పార్లమెంట్​ ఎన్నికల్లో తెలుగు బిడ్డ - పీవీ బంధువు కూడా..

వ్రాసిన వారు Stalin
Jul 04, 2024
06:21 pm

ఈ వార్తాకథనం ఏంటి

బ్రిటన్‌లో సార్వత్రిక ఎన్నికల సమరం మొదలైంది. ప్రధాని పదవి కోసం ఓటింగ్ జరుగుతోంది. ఈ ఎన్నికల్లో కన్జర్వేటివ్ పార్టీ నుంచి ప్రస్తుత ప్రధానమంత్రి రిషి సునాక్‌ పోటీ చేయగ, ప్రతిపక్ష లేబర్ పార్టీ నుంచి కైర్ స్టార్మర్ పోటీ చేస్తున్నారు. అయితే ఈ సారి ఎన్నికల్లో భారతీయ సంతతికి చెందిన ఎంపీల సంఖ్య ఎక్కువగా ఉందని తెలిసింది. 100 మందికి పైగా భారతీయ సంతతి అభ్యర్థులు యూకే ఎన్నికల్లో పోటీ చేశారని సమాచారం అందింది. అయితే ఈ బ్రిటన్ పార్లమెంట్ ఎన్నికల్లో ఓ తెలుగు వ్యక్తి పోటీ చేయడం ఇక్కడ చర్చనీయాంశమైంది. సరికొత్త ఉత్సాహాన్ని నింపుతోంది.

ఉదయ్

లేబర్ పార్టీ తరఫున పోటీ

అతడి పేరు ఉదయ్ నాగరాజు. నార్త్ బెడ్ ఫోర్డ్ షైర్ నుంచి లేబర్ పార్టీ తరఫున ఎన్నికల బరిలో నిలిచారు. ఓ ప్రముఖ సర్వే సంస్థ ప్రకారం ఆ నియోజకవర్గంలో 68 శాతం లేబర్ పార్టీ గెలుస్తుందని అంచనాలు ఉన్నాయి. దీంతో తెలుగు బిడ్డ అంతటి స్థాయికి వెళ్లినందుకు ఇక్కడి వాళ్లు గర్విస్తున్నారు. స్వస్థలం ఎక్కడంటే ? - ఉదయ్ నాగరాజుది తెలంగాణలోని పూర్వ కరీంనగర్ అంటే ప్రస్తుత సిద్దిపేట జిల్లా కోహెడ మండలం శనిగరం గ్రామం. హనుమంత రావు, నిర్మలాదేవి దంపతుల కుమారుడు. చిన్నప్పటి నుంచే కష్టపడేతత్వం ఉంది. అందుకే ఆయన అంచెలంచలుగా ఎదిగారు. బ్రిటన్​లోని కాలేజీ అఫ్ లండన్​ యూనివర్సిటీ పాలనా శాస్తంలో పీజీ చేశారు.

ఉదయ్

మాజీ ప్రధాని పీవీతో బంధుత్వం 

యూకేలో ఏఐ పాలసీలాబ్స్ అనే థింక్-ట్యాంక్​ను ఉదయ్ నెలకొల్పారు. అంతర్జాతీయ వక్తగా, రచయితగానూ పేరు సంపాదించారు. క్షేత్రస్థాయి సమస్యలపైన ఈయన మంచి అవగాహన ఉంది. స్కూల్ గవర్నర్​గా, వాలంటీర్​గా, విస్తృత రాజకీయ ప్రచారకుడిగా ఒక దశాబ్దకాలంగా ఇంటింటికీ ప్రచారం చేశారు. ఉదయ్ నాగరాజుకు మాజీ ప్రధాని పీవీ నరసింహారావు, మాజీ రాజ్యసభ ఎంపీ కెప్టెన్ లక్ష్మీకాంత రావుతో మంచి బంధుత్వం ఉంది. గతంలో బ్రిటన్ పర్యటనలకు వెళ్లినప్పుడు అప్పటి ఐటీ పరిశ్రమల శాఖమంత్రి కేటీఆర్‌తో పాటు ఎంపీ కవితతో కలిసి పలు కార్యక్రమాల్లోను నాగరాజు పాల్గొన్నారు.