UK Chocolate: హాలండ్ అండ్ బారెట్ కొత్త చాక్లెట్ బార్ పై UKలో భారీగా దుమారం
UK ప్రముఖ ఆరోగ్య ఆహార ఉత్పత్తి సంస్ధల్లో ఒకటైన హాలండ్ & బారెట్ కొత్త చాక్లెట్ బార్ తయారు చేసింది. ఆ చాక్లెట్ తింటే మహిళల్లో మోనోపాజ్'ను సులభతరం చేస్తుందని పేర్కొంది. అయితే ఈ కొత్త చాక్లెట్ బార్ ప్రకటన నవ్వులపాలైంది. £3.79 ధరతో, మోనోపాజ్ లక్షణాల కోసం దోహదపడుతుందని ఆ ప్రకటన తెలిపింది. చాక్లెట్ బార్ "హార్మోన్ల కార్యకలాపాల సమతుల్యతకు "కు దోహదపడుతుందని పేర్కొంది. 75 గ్రా డార్క్ చాక్లెట్ బార్‌లో విటమిన్ B6 ఉంటుంది. ఇది సాధారణంగా బాదంపప్పులో ఉంటుంది.
UK మెనోపాజ్ ప్రచారకర్త కేట్ ముయిర్ మండిపాటు
UK మెనోపాజ్ ప్రచారకర్త కేట్ ముయిర్ ఈ ఉత్పత్తిపై తీవ్రంగా స్పందించారు. తేలికగా డబ్బు సంపాదించే ఉత్పత్తన్నారు. ఇది బలహీన మహిళలను దోపిడీ చేస్తుందని ఆమె ఆరోపించారు. అటువంటి ఉత్పత్తులపై ఆధారపడవద్దని సూచించారు. దీనికి బదులు NHS నుండి సరైన వైద్య సహాయం పొందాలని ప్రాముఖ్యతను ఆమె సూచించారు. ముఖ్యంగా పెరిమెనోపాజ్‌లో ఉన్న మహిళల్లో ఆత్మహత్యల రేటు గరిష్ట స్థాయిలో వుందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. సోషల్ మీడియా మాత్రం కేట్ ముయిర్ అభిప్రాయంతో ఏకీభవించింది. ఉత్పత్తిని "అవమానకరమైనది" గా అభివర్ణించింది. ఇది "లాభదాయకమైన వేలం వెర్రిని ప్రోత్సహిస్తుంది" అంటూ ఈ వాదనని తిరస్కరించింది. చాక్లెట్ బార్‌లలో సాధారణ మహిళకు ఉపయోగపడే రోజువారీ సంతృప్త కొవ్వు మొత్తం కూడా ఉందని అభిప్రాయపడింది.
సోషల్ మీడియా విమర్శలకు హాలండ్ & బారెట్ ప్రతినిధి స్పందన
ముయిర్, సోషల్ మీడియా విమర్శలకు హాలండ్ & బారెట్ ప్రతినిధి స్పందించారు. తమ ఆహార శ్రేణి ప్రసిద్ధ స్నాక్స్‌కు ప్రత్యామ్నాయంగా వీటిని అందించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుందన్నారు. చాక్లెట్ బార్ అందులోని కంటెంట్‌లు సమతుల్య ఆహారం ఆరోగ్యకరమైన జీవనశైలికి దోహదపడనున్నాయి. ఇతర చాక్లెట్ బార్‌లతో పోలిస్తే అదనపు ప్రయోజనాలతో కూడిన ప్రయోజనాలను అందిస్తుందని హాలండ్ & బారెట్ ప్రకటన స్పష్టం చేసింది.