LOADING...
UK: పాత ఫొటోలు, ఈమెయిల్స్‌ తొలగించండి.. నీటి కరవు నివారణలో భాగస్వాములు కండి
పాత ఫొటోలు, ఈమెయిల్స్‌ తొలగించండి.. నీటి కరవు నివారణలో భాగస్వాములు కండి

UK: పాత ఫొటోలు, ఈమెయిల్స్‌ తొలగించండి.. నీటి కరవు నివారణలో భాగస్వాములు కండి

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 13, 2025
02:43 pm

ఈ వార్తాకథనం ఏంటి

యూకేలో నీటి కరవు తీవ్రరూపం దాల్చింది. ఈ పరిస్థితిని తట్టుకోడానికి బ్రిటన్‌ ప్రభుత్వం విభిన్న సూచనలు చేస్తోంది. అందులో భాగంగా ప్రజలను తమ ఇన్‌బాక్స్‌లను క్లీన్‌ చేయమని పిలుపునిచ్చింది. ఆశ్చర్యంగా అనిపించినా, పాత ఈమెయిల్స్‌, ఫొటోలను డిలీట్‌ చేయడం ద్వారా కూడా నీటిని కాపాడవచ్చని అధికారులు చెబుతున్నారు. క్లౌడ్‌ స్టోరేజ్‌లో డేటాను నిల్వ చేయడానికి పెద్దఎత్తున డేటా సెంటర్లు అవసరమవుతాయి. వీటిలోని సిస్టమ్‌లను చల్లబర్చడానికి రోజువారీగా విపరీతమైన నీటిని వినియోగిస్తారు. బ్రిటన్‌ ప్రభుత్వం వెల్లడించిన వివరాల ప్రకారం, భారీ డేటా సెంటర్లు రోజుకు సుమారు 50 లక్షల గ్యాలన్ల నీటిని వాడుతున్నాయి. ఈ పరిమాణం 10,000 నుంచి 50,000 జనాభా గల పట్టణానికి సరిపడేంత నీరు.

Details

నీటి పొదుపు దేశానికి అత్యవసరం

ప్రస్తుతం బ్రిటన్‌ నాలుగో హీట్‌వేవ్‌ను ఎదుర్కొంటోంది. ఇంగ్లాండ్‌లోని ఐదు ప్రాంతాల్లో అధికారికంగా కరవు ప్రకటించగా, మరో ఆరు ప్రాంతాల్లో తీవ్రమైన పొడి వాతావరణం నెలకొంది. ఈ పరిస్థితుల్లో నీటి పొదుపు దేశానికి అత్యవసరమని, ప్రజలు తప్పనిసరిగా కొన్ని అలవాట్లు మార్చుకోవాలని ఎన్విరాన్‌మెంట్‌ ఏజెన్సీ డైరెక్టర్‌ ఆఫ్‌ వాటర్‌ హెలెన్‌ సూచించారు.

Details

ఆ సూచనలు ఇవే

* గార్డెన్‌ కోసం వర్షపు నీటిని సేకరించే **రెయిన్‌ బట్‌లు** ఏర్పాటు చేయాలి. * టాయిలెట్లు, వాష్‌రూముల్లో లీకేజీలను సరిచేయడం ద్వారా రోజుకు 200-400 లీటర్ల నీటిని ఆదా చేయాలి. * వంటగదిలో వాడిన నీటిని మొక్కలకు ఉపయోగించాలి. * లాన్‌లో నీటి వినియోగాన్ని తగ్గించాలి. * దంతాలు తోమేటప్పుడు లేదా షేవింగ్‌ చేసేటప్పుడు ట్యాప్‌ మూసివేయాలి. * షవర్‌ కింద గడిపే సమయాన్ని తగ్గించాలి. * పాత ఈమెయిల్స్‌, ఫొటోలను డిలీట్‌ చేసి డేటా సెంటర్లపై ఒత్తిడి తగ్గించాలి.