Page Loader
Keir Starmer: ట్రంప్ చర్యలతో ప్రపంచీకరణ బలహీనమవుతోంది.. బ్రిటన్ ప్రధానమంత్రి ఆందోళన
ట్రంప్ చర్యలతో ప్రపంచీకరణ బలహీనమవుతోంది.. బ్రిటన్ ప్రధానమంత్రి ఆందోళన

Keir Starmer: ట్రంప్ చర్యలతో ప్రపంచీకరణ బలహీనమవుతోంది.. బ్రిటన్ ప్రధానమంత్రి ఆందోళన

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 06, 2025
11:55 am

ఈ వార్తాకథనం ఏంటి

'అమెరికా ఫస్ట్‌' నినాదంతో డొనాల్డ్ ట్రంప్ ప్రపంచ దేశాలపై భారీ దిగుమతి పన్నులు విధించిన విషయం తెలిసిందే. ఈ చర్యల ప్రభావంతో అంతర్జాతీయ మార్కెట్లు తీవ్ర అనిశ్చితిలోకి జారుకున్నాయని బ్రిటన్ ప్రధాన మంత్రి కీర్ స్టార్మర్ వ్యాఖ్యానించారు. సోవియట్ యూనియన్ 1991లో కూలిపోవడంతో ప్రారంభమైన గ్లోబలైజేషన్ ఎపిసోడ్‌ ఇప్పుడు ముగిసిందని స్టార్మర్ సోమవారం అధికారికంగా ప్రకటించనున్నారని పలు అంతర్జాతీయ మీడియా సంస్థలు పేర్కొన్నాయి. టైమ్స్‌ ప్రచురించిన నివేదిక ప్రకారం, అమెరికా ఆర్థిక జాతీయవాదం దిశగా తీసుకుంటున్న నిర్ణయాలను స్టార్మర్ కూడా అంగీకరించినట్లు తెలుస్తోంది. ప్రపంచ వాణిజ్యంలో ఇప్పుడు కొత్త యుగం మొదలైందని, అమెరికా నాయకత్వం తీసుకున్న మార్గాన్ని వారి జాతీయతే కాకుండా ప్రజలు కూడా సమర్థిస్తున్నారని ఆయన అభిప్రాయపడ్డారు.

Details

వాణిజ్య యుద్ధాలు పరిష్కారం కాదు

గ్లోబలైజేషన్ చాలా మంది శ్రామికులకు ప్రయోజనం కలిగించలేదని పేర్కొంటూ, తాము మాత్రం వాణిజ్య యుద్ధాలు పరిష్కారమని నమ్మడం లేదని స్పష్టం చేశారు. ప్రపంచీకరణ బదులుగా మరో మెరుగైన మోడల్‌ అవసరం ఉందని, ఇలాంటి సంక్షోభాల సమయంలో ప్రత్యామ్నాయం చూపించడానికి ఇది ఒక గొప్ప అవకాశం అని స్టార్మర్ గతంలో చెప్పారు. గత నెల హాంకాంగ్‌లో నిర్వహించిన గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ సమ్మిట్‌లో హెచ్‌ఎస్‌బీసీ చీఫ్ సర్ మార్క్ టక్కర్ మాట్లాడుతూ.. అమెరికా విధానం కారణంగా ప్రపంచం చిన్న చిన్న ప్రాంతీయ బ్లాకులు, వాణిజ్య క్లస్టర్లుగా విడిపోవడమే కాక, వాటి మధ్య భవిష్యత్తులో బలమైన సంబంధాలు ఏర్పడే అవకాశం ఉందని అంచనా వేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో స్టార్మర్ వ్యాఖ్యలు గణనీయంగా మారాయి.