Page Loader
Lottery Jackpot: బ్రిటిష్ వ్యక్తి బంపర్‌ ఆఫర్‌.. లాటరీలో రూ. 1800 కోట్లు.. UK చరిత్రలో మూడవ అతిపెద్ద జాక్‌పాట్
బ్రిటిష్ వ్యక్తి బంపర్‌ ఆఫర్‌.. లాటరీలో రూ. 1800 కోట్లు.. UK చరిత్రలో మూడవ అతిపెద్ద జాక్‌పాట్

Lottery Jackpot: బ్రిటిష్ వ్యక్తి బంపర్‌ ఆఫర్‌.. లాటరీలో రూ. 1800 కోట్లు.. UK చరిత్రలో మూడవ అతిపెద్ద జాక్‌పాట్

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 27, 2024
02:06 pm

ఈ వార్తాకథనం ఏంటి

అదృష్టం ఎవరిని, ఎప్పుడు వరిస్తుందో చెప్పడం అసాధ్యం. ముఖ్యంగా లాటరీ టికెట్ల విషయంలో, బంపర్ ఆఫర్ కొద్ది మందికి మాత్రమే లభిస్తుంది. ఇటీవల, బ్రిటన్‌కు చెందిన ఒక వ్యక్తి ఈ అదృష్టం తగిలింది. నేషనల్ లాటరీలో టికెట్ కొన్న అతను ఏకంగా 177 మిలియన్ పౌండ్లు (దాదాపు రూ.1800 కోట్లు) గెలుచుకున్నాడు. ఇది యూకే చరిత్రలో మూడో అతిపెద్ద లాటరీ జాక్‌పాట్‌గా గుర్తింపు పొందింది.

వివరాలు 

అదృష్టం ముంచుకొచ్చిన టికెట్ 

మంగళవారం నాడు లాటరీ నిర్వాహకులు నిర్వహించిన డ్రాలో 07, 11, 25, 31, 40 నంబర్ల కలయికతో కూడిన టికెట్‌కు జాక్‌పాట్ తగిలినట్లు వెల్లడించారు. ఈ టికెట్ ఒకే వ్యక్తి వద్ద ఉండగా, అతను 2023 సండే టైమ్స్ రిచ్ లిస్ట్‌లో ఉన్న ప్రముఖ గాయకులు హ్యారీ స్టైల్స్,అడెలేలను మించిపోయే స్థాయిలో ధనవంతుడయ్యాడని లాటరీ నిర్వాహకులు తెలిపారు.అయితే,విజేత వ్యక్తిగత వివరాలను గోప్యంగా ఉంచారు. మునుపటి రికార్డులు గతంలో 2022 మే 10న వచ్చిన ఒక లాటరీ ప్రైజ్‌మనీ యూకే చరిత్రలో అతిపెద్ద జాక్‌పాట్‌గా నిలిచింది. అదే ఏడాది జులై 19న, గ్లౌసెస్టర్‌కు చెందిన జో మరియు జెస్ త్వైట్‌లు నేషనల్ లాటరీలో 195 మిలియన్ పౌండ్ల ప్రైజ్ గెలుచుకుని ఈ రికార్డును అధిగమించారు.