
Britain : బ్రిటన్ రాజకుటుంబంలో 'నగలు' కోసం కలహాలు
ఈ వార్తాకథనం ఏంటి
బ్రిటన్ రాజకుటుంబానికి సంబంధించి అంత:పుర విషయాలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి.
బ్రిటన్ రాజవంశ వారసులు విలియం, ప్రిన్స్ హ్యారీ మధ్య మరోసారి విభేదాలు బయటపడ్డాయి.
తన తల్లి ప్రిన్సెస్ డయానా అభరణాలను సోదరుడి భార్య మెర్కెల్ ధరించకుండా విలియం అడ్డుకున్నట్లు తెలుస్తోంది.
ఈ విషయాన్ని 'కేథరిన్.. ది ప్రిన్సెస్ ఆఫ్ వేల్స్' పుస్తకంలో రచయిత రాబ్ జాబ్సస్ రాశాడు.
గతేడాది నుంచి విలియం, అతని సోదరుడు ప్రిన్స్ హ్యారీ మధ్య విభేదాలు తలెత్తిన విషయం తెలిసిందే.
Details
పెళ్లి ప్రస్తావన కారణంగా విభేదాలు
హ్యారి నటి మేఘన్ మెర్కెట్ పెళ్లి ప్రస్తావన నుంచి వారిద్దరి మధ్య రిలేషన్ షిప్ తగ్గింది.
తన సోదరుడు మాట వినకుండా మేఘన్‌ను హ్యారి పెళ్లి చేసుకున్నాడు. దీంతో వీరిద్దరి విభేదాలు తారాస్థాయికి చేరాయి.
ఇక మెర్కెల్ ని రాజకుటుంబంలోకి తీసుకురావడానికి విలియం నిరాకరించాడని హ్యారి వెల్లడించారు.
మరోవైపు తన తల్లి అభరణాలను విలియం భార్య కేట్ మాత్రమే ధరించాలని కోరుకుంటున్నాడని పేర్కొన్నాడు.
Details
స్పెర్ పేరుతో పుస్తకాన్ని రాసిని హ్యారి
స్పెర్ పేరుతో ఒకప్పుడు హ్యారి తన అనుభవాలతో ఓ పుస్తకం రాసిన రాయగా, అప్పట్లో ఆ పుస్తకం సంచలనం సృష్టించింది.
తల్లి ఆభరణాల గురించి సోదరుల మధ్య విభేదాలు రావడంతో కుటుంబ పరువు బజారున పడిందని రాజకుటుంబీలు అవేదన వ్యక్తం చేస్తున్నారు.