
King Charles III: బ్రిటన్ రాజు చార్లెస్‌కు క్యాన్సర్.. బకింగ్‌హామ్ ప్యాలెస్ ప్రకటన
ఈ వార్తాకథనం ఏంటి
బ్రిటన్ రాజభవనం బకింగ్‌హామ్ ప్యాలెస్ సంచలన ప్రకటన చేసింది. బ్రిటన్ రాజు చార్లెస్ III క్యాన్సర్‌తో బాధపడుతున్నట్లు వెల్లడించింది.
దీంతో తమ బహిరంగ కార్యక్రమాలన్నింటినీ వాయిదా వేస్తున్నట్లు బకింగ్‌హామ్ ప్యాలెస్ ఒక ప్రకటన విడుదల చేసింది.
జనవరిలో 75 ఏళ్ల కింగ్ చార్లెస్ మూడు రోజుల పాటు ఆస్పత్రిలో ప్రోస్టేట్ సమస్య కోసం చికిత్స తీసుకున్నారు.
ఈ క్రమంలో వైద్యులు చేసిన పరీక్షల్లో శరీరంలో క్యాన్సర్ కణాలు ఉన్నట్లు వైద్యులు గుర్తించినట్లు ప్యాలెస్ వెల్లడించింది.
ప్రస్తుతం చార్లెస్ ప్యాలెస్‌లోనే చికిత్స తీసుకుంటున్నట్లు పేర్కొంది. శరీరంలో క్యాన్సర్ కణాలు ఉన్నాయి కానీ, అది ప్రోస్టేట్ క్యాన్సర్ కాదని బకింగ్‌హామ్ ప్యాలెస్ చెప్పింది.
బ్రిటన్
చార్లెస్ త్వరగా కోలుకోవాలి: సునక్, బైడెన్
ప్రస్తుతం బ్రిటన్ రాజుగా చార్లెస్- III కొనసాగుతారని, అయితే ఆయన ఆరోగ్యం దృష్ట్యా కొన్ని రోజుల పాటు బహిరంగ కార్యక్రమాలకు దూరంగా ఉంటారని ప్యాలెస్ తెలిపింది.
చార్లెస్- III ఆరోగ్యంపై దేశాధినేతలు స్పందించారు. కింగ్ చార్లెస్ త్వరగా కోలుకోవాలని యూకే ప్రధాని రిషి సునక్ కూడా ఆకాంక్షించారు.
చార్లెస్ మళ్లీ మామూలు మనిషి కావాలని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఒక ప్రకటన విడుదల చేసారు.
క్వీన్ ఎలిజబెత్ మరణం తరువాత నవంబర్ 2022 లో రాజుగా చార్లెస్‌కు పట్టాభిషేకం చేశారు.