
పారాచూట్ ఫెయిల్.. 29 అంతస్తుల భవనంపై నుంచి పడి బ్రిటిష్ స్కైడైవర్ దుర్మరణం
ఈ వార్తాకథనం ఏంటి
థాయిలాండ్ లోని పట్టాయాలో ఘోరం జరిగింది. 29 అంతస్తుల భవనంపై నుంచి పడి బ్రిటీష్ స్కైడైవర్ నాతీ ఓడిన్సన్ మరణించాడు.
భవనం నుంచి నుండి దూకినప్పుడు అతని పారాచూట్ ఫెయిల్ అయి.. తెరుచుకోకపోవడంతో.. అతను నేరుగా నేలపై పడి చనిపోయాడు.
పట్టాయాలోని తూర్పు బీచ్ రిసార్ట్‌లో ఈ సంఘటన జరిగింది. ఒక వ్యక్తి భవనంపై నుంచి చెట్టును ఢీకొని నేలపై పడటాన్ని స్థానికులు చూశారు.
ఈ మేరకు స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఓడిన్సన్ భవనంపై నుంచి దూకే సమయంలో అతని స్నేహితుడు తీసిన వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
వైరల్ అవుతున్న స్కైడైవర్ వీడియో
A base jumper fell to his death off a 29-storey building after his parachute failed to open
— Metro (@MetroUK) January 28, 2024
Nathy Odinson posted videos of his stunts to social media, so sadly, his friend was recording the entire horrifying incident pic.twitter.com/Uf0nyyIAnk