Page Loader
Emergency: ఎమర్జెన్సీ చిత్రానికి బ్రిటన్ ఎంపీ మద్దతు.. భారత్ నేతలపై కంగనా రనౌత్‌ హాట్ కామెంట్స్
ఎమర్జెన్సీ చిత్రానికి బ్రిటన్ ఎంపీ మద్దతు.. భారత్ నేతలపై కంగనా రనౌత్‌ హాట్ కామెంట్స్

Emergency: ఎమర్జెన్సీ చిత్రానికి బ్రిటన్ ఎంపీ మద్దతు.. భారత్ నేతలపై కంగనా రనౌత్‌ హాట్ కామెంట్స్

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 25, 2025
12:41 pm

ఈ వార్తాకథనం ఏంటి

బ్రిటన్‌లో ఎమర్జెన్సీ చిత్రం స్క్రీనింగ్‌ను కొంతమంది సిక్కులు అడ్డుకోవడంతో థియేటర్‌లో చిత్రం ప్రదర్శనను నిలిపి వేయాల్సి వచ్చింది. బ్రిటన్ ఎంపీ బాబ్ బ్లాక్‌మన్ ఈ చర్యను ఖండిస్తూ, భావ స్వేచ్ఛను అడ్డుకోవడం సరైనదేమీ కాదని అన్నారు. ఆయన ఈ వ్యాఖ్యలను యూకే పార్లమెంట్‌లో చేస్తూ, వీడియోని కంగనా తన ట్విట్టర్‌లో పంచుకుంది. కంగనా ఈ విషయంపై స్పందించారు. భారతీయ రాజకీయ నేతలు, ఫెమినిస్టులు ఈ అంశంపై మౌనంగా ఉన్నారని ఆరోపించింది. ఎమర్జెన్సీ చిత్ర ప్రదర్శన అడ్డుకునే అంశంపై భారతీయ విదేశాంగ శాఖ బ్రిటన్‌తో చర్చించిందని, తమ అభ్యర్థనలను వారు తెలిపారు.

Details

భావ ప్రకటన స్వేచ్ఛను అడ్డుకోవడం సరైనది కాదు 

హారో వూ సినిమా హాల్లో, సుమారు 40 నిమిషాలు చిత్రం ప్రదర్శించిన తర్వాత, మాస్కులు ధరించిన ఖలిస్తానీ మద్దతుదారులు సినిమా స్క్రీనింగ్‌ను నిలిపివేశారు. వారు చిత్రాన్ని చూస్తున్న ప్రేక్షకులను బెదిరించి బయటకు పంపించారు. దీనిపై ఎంపీ బాబ్ బ్లాక్‌మన్ విచారం వ్యక్తం చేశారు. భావ ప్రకటన స్వేచ్ఛను అడ్డుకోవడం సరియైన చర్య కాదని అన్నారు. భారతీయ విదేశాంగ శాఖ ప్రతినిధి రణ్‌దీర్ జైస్వాల్ ఈ ఘటనను పరిశీలించినట్లు తెలిపారు. సిక్కు ప్రెస్ అసోసియేషన్ ఎమర్జెన్సీ చిత్రాన్ని సిక్కుల వ్యతిరేక చిత్రంగా భావిస్తోందని ప్రకటించింది.

Details

ఇందిరా గాంధీ చిత్రం ఆధారంగా ఎమర్జెన్సీ

ఎమర్జెన్సీ చిత్రం 1975లో భారత ప్రధాని ఇందిరా గాంధీ జీవిత ఆధారంగా రూపొందించారు. ఈ చిత్రాన్ని నటి కంగనా రనౌత్ దర్శకత్వం వహించగా, ఆమె ఇందిరా గాంధీ పాత్రను నటించింది. 1971 ఇండో-పాక్ యుద్ధం, ఇందిర గాంధీ తీసుకున్న కీలక నిర్ణయాలు, బ్లూ స్టార్ ఆపరేషన్, సంజయ్ గాంధీ తదితర అంశాలు ఈ చిత్రంలో ప్రదర్శించారు. కంగనాకు ఈ చిత్రంలో అత్యద్భుతమైన నటన కోసం ప్రశంసలు లభించాయి.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ట్విట్టర్ వేదికగా స్పందించిన కంగనా రనౌత్