
Earth's Magnetic Poles: రష్యా వైపు కదులుతున్న ఉత్తర ధ్రువం.. భూమి భవిష్యత్తుపై అనుమానాలు
ఈ వార్తాకథనం ఏంటి
భూమి అయస్కాంత క్షేత్రంలో వేగవంతమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయని బ్రిటన్ శాస్త్రవేత్తలు వెల్లడించారు.
ముఖ్యంగా భూమి ఉత్తర ధ్రువం రష్యా వైపు కదులుతోందని పరిశోధకులు నిర్ధారించారు. లైవ్ సైన్స్ నివేదిక ప్రకారం, శాస్త్రవేత్తలు దశాబ్ధాలుగా ఉత్తర ధ్రువాన్ని ట్రాక్ చేస్తున్నారు.
1990-2005 మధ్య ఈ ధ్రువం కదలిక రేటు ఏడాదికి 15 కిలోమీటర్ల నుంచి 50-60 కిలోమీటర్లకు పెరిగినట్లు చెబుతున్నారు.
భూమి అయస్కాంత క్షేత్రం మన గమన సామర్థ్యాల నుంచి భూగోళ రక్షణ వరకు కీలకమైన పాత్ర పోషిస్తుంది.
నావిగేషన్ వ్యవస్థలు, గ్లోబల్ పాజిషనింగ్ సిస్టమ్ వంటి టెక్నాలజీలు ఈ క్షేత్రంపై ఆధారపడుతున్నాయి.
Details
జీవాలకు పెను ప్రమాదం
ఈ క్షేత్రం భూమి మీద జీవాలకు ప్రమాదకరమైన రేడియేషన్‌ను నిరోధించి భూ వాతావరణాన్ని రక్షిస్తుంది.
శాస్త్రవేత్తల అంచనా ప్రకారం, ఈ కదలికలు ఇలాగే కొనసాగితే రాబోయే దశాబ్దాల్లో ఉత్తర ధ్రువం సుమారు 660 కిలోమీటర్లు కదిలే అవకాశం ఉంది.
బ్రిటీష్ జియోలాజికల్ సర్వే ప్రకారం, 2040 నాటికి దిక్సూచిలు నిజమైన ఉత్తరానికి కాకుండా తూర్పు వైపుగా సూచించవచ్చు.
ఒకే విధంగా, దక్షిణ ధ్రువం కూడా కదులుతూ అంటార్కిటికా మీదుగా తూర్పు వైపునకు జారిపోతుంది.
ఇది ప్రతి 3 లక్షల సంవత్సరాలకు జరిగే ప్రక్రియ అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. చివరిసారిగా ధ్రువ మార్పు సుమారు 7,80,000 ఏళ్ల క్రితం జరిగింది.
Details
భూగోళంపై ప్రభావం చూపే అవకాశం
భూమి బయటి కోర్‌లోని ద్రవరూప ఇనుము అసాధారణ మార్గాల్లో ప్రవహించడం వల్ల ఈ మార్పులు జరుగుతాయి.
ధ్రువాలు మారుతున్నప్పుడు, భూమి అయస్కాంత క్షేత్రం తాత్కాలికంగా జీరో స్థాయికి చేరే ప్రమాదం ఉంటుంది.
భూమి అయస్కాంత క్షేత్రం కనుమరుగైతే, సౌర వాయువులు భూమిపై విరుచుకుపడి జీవరాశులకు తీవ్రమైన ముప్పు తెస్తాయి.
భూమి రక్షణకు అయస్కాంత క్షేత్రం ఎంత ముఖ్యమో శాస్త్రవేత్తల అధ్యయనాలు చాటి చెబుతున్నాయి. రాబోయే కాలంలో ఈ మార్పులు భూగోళంపై ప్రభావం చూపే అవకాశం ఉంది.