LOADING...
Modi-Trump: సుంకాలు తగ్గించిన ట్రంప్‌కు మోదీ కృతజ్ఞతలు
సుంకాలు తగ్గించిన ట్రంప్‌కు మోదీ కృతజ్ఞతలు

Modi-Trump: సుంకాలు తగ్గించిన ట్రంప్‌కు మోదీ కృతజ్ఞతలు

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 03, 2026
09:24 am

ఈ వార్తాకథనం ఏంటి

భారత్-అమెరికా మధ్య సంబంధాలు మళ్లీ బలపడుతున్నాయి. గతేడాది దెబ్బతిన్న సంబంధాలు కొత్త ఏడాదిలో చిగురుస్తున్నాయి. గడచిన సంవత్సరంలో సుంకాల కారణంగా రెండు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలు కాస్త క్షీణించగా, తాజాగా జరిగిన ఫోన్ కాల్ సంభాషణతో తిరిగి బలపడ్డాయి. సోమవారం, ప్రెసిడెంట్ ట్రంప్, ప్రధాని నరేంద్ర మోదీ మధ్య జరిగిన ఫోన్ కాల్ తర్వాత, ట్రంప్ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేశారు. భారత్‌పై 18శాతం సుంకాలను తగ్గించారనీ,ఈ నిర్ణయం వెంటనే అమలు కానుందనీ ఇందులో ఆయన వెల్లడించారు. అలాగే,రష్యా చమురు సరఫరా నిలిపివేతకు భారత్ అంగీకరించిందని,భారత్‌పై 25శాతం అదనపు సుంకాలు ఉండవు అని స్పష్టత ఇచ్చారు.

వివరాలు 

మోదీ గొప్ప స్నేహితుడు: ట్రంప్ 

ఇరు దేశాల మధ్య మంచి వాణిజ్య ఒప్పందాలు జరిగినట్లుగా పేర్కొన్నారు. మోదీ గొప్ప స్నేహితుడు అంటూ కొనియాడారు. ఈ సందర్భంగా ఇండియా టుడే మ్యాగజైన్ కవర్‌లోని ట్రంప్-మోడీ ఫోటోను కూడా పోస్ట్ చేశారు. ఇక భారత్‌పై 18 శాతం సుంకాలు తగ్గించినట్లుగా ట్రంప్ ప్రకటన రాగానే ప్రధాని మోదీ ఎక్స్‌లో కృతజ్ఞతలు తెలిపారు.

వివరాలు 

పరస్పర సహకారానికి ఎన్నో అవకాశాలు: మోదీ 

"నా ప్రియమైన స్నేహితుడు ట్రంప్‌తో ఈరోజు ఫోన్‌లో మాట్లాడడం చాలా ఆనందంగా ఉంది. మేడ్ ఇన్ ఇండియా ఉత్పత్తులపై సుంకాలు 18శాతానికి తగ్గించినట్లు తెలుసుకుని ఎంతో సంతోషంగా ఉన్నాను. భారతదేశ ప్రజల తరపున అధ్యక్షుడు ట్రంప్‌కు నా హృదయపూర్వక ధన్యవాదాలు. రెండు ప్రధాన ఆర్థిక వ్యవస్థలు, ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్యాలు కలిసి పనిచేస్తే, ప్రజలకు వాస్తవ ప్రయోజనం చేకూరుతుంది. పరస్పర సహకారానికి ఎన్నో అవకాశాలు తెరుస్తుంది. ప్రపంచ శాంతి, స్థిరత్వం, శ్రేయస్సు కోసం ట్రంప్ నాయకత్వం కీలకంగా ఉంది. ఆయన శాంతి కోసం చేసే ప్రతి ప్రయత్నానికి భారత్ పూర్తి మద్దతు ఇస్తుంది. భారత్-అమెరికా భాగస్వామ్యాన్ని కొత్త శిఖరాల వరకు తీసుకెళ్లడానికి ట్రంప్‌తో కలిసి పని చేయడానికి ఎదురుచూస్తున్నాను"అంటూ మోదీ రాసుకొచ్చారు.

Advertisement